ఆ ఇంజెక్షన్స్ వాడుతున్నారా? .. బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై తమన్నా క్లారిటీ!
సినీ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. కానీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఆ కష్టాన్ని సాధ్యమని నిరూపించింది. ఎవరి సపోర్ట్ లేకుండా తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్‌గా మారిన ఆమె, ఇప్పుడు 20 ఏళ్లు పూర్తిచేసుకుంటున్నా అదే గ్లామర్, ఆకర్షణతో ప్రేక్షకులను అలరిస్తోంది. నార్త్‌కి చెందిన తమన్నా, సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇటీవల తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు.
సౌత్,నార్త్ అనే సంబంధం లేకుండా ఇండస్ట్రీల్లో రాణిస్తుంది నటి తమన్నా భాటియా. కెరీర్ ప్రారంభంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించింది. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తూ, స్పెషల్ సాంగ్స్‌తో కూడా మ్యాజిక్ సృష్టిస్తోంది. జైలర్‌లో 'కావాలయ్యా', స్త్రీ 2లో 'ఆజ్ కి రాత్' పాటలతో ఆమె డ్యాన్స్ స్టెప్స్‌కు యువత ఫిదా అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా తన శరీర మార్పులు, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ గురించి ఓపెన్ అయింది.

తమన్నా భాటియా బోల్డ్‌గా మాట్లాతూ.. "నా బాడీ నా గర్వం, గ్లోబల్ స్టాండర్డ్స్ కోసం నేనెప్పుడూ మారను" అని చెప్పి మరోసారి తన ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. అయితే కొంతమంది నెటిజన్లు ఆమె కొత్త లుక్ వెనుక "ఓజెంపిక్ (Ozempic)" వాడినట్లు రూమర్స్ పుట్టించగా, తమన్నా.. ఇప్పుడు వాటికి సమాధానం చెప్పారు. "నేను 15 ఏళ్ల వయసు నుంచే కెమెరా ముందు ఉన్నాను. ప్రజలు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు. 20 ఏళ్ల వయసులో నేను సహజంగానే సన్నగా ఉండే బాడీ టైప్ కలిగి ఉన్నాను. ఇప్పుడు నా శరీరంలో పెద్ద మార్పు ఏమీ లేదు. ఇది నాకు కొత్త కాదు," అని స్పష్టం చేశారు.
తమన్నా మాట్లాడుతూ, "ఇది హిందీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించవచ్చు కానీ నేను నా కెరీర్‌లో చాలా రకాల పాత్రల్లో, రకరకాల లుక్‌లలో కనిపించాను. మహిళ శరీరం ప్రతి ఐదేళ్లకు ఒకసారి మారుతుంది. మనం ప్రతిసారి మన కొత్త రూపాన్ని చూస్తుంటాం," అని తెలిపారు. కోవిడ్ సమయంలో తన శరీరంలో వచ్చిన మార్పులను తమన్నా నిష్కపటంగా వెల్లడించారు.
"కోవిడ్ నా శరీరాన్ని తీవ్ర ప్రభావితం చూపింది. నేను 20 ఏళ్లలో ఉన్న బరువుని అలాగే ఉంచడం చాలా కష్టమైంది. నాకు తినడం అంటే ఇష్టం, అన్నం, రొట్టి, దాల్ అన్నీ నా ఫేవరెట్," అని అన్నారు. తమన్నా చెబుతూ, "నా శరీరంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, కెమెరా ముందు నిలబడటం ఎప్పుడూ ఒక సవాలు. ఒక దశలో నా పొట్ట బయటకు వస్తుందేమో అని అనిపించేది. కానీ, వాటిని ఆలోచించకూడదు. నేను ఏ సైజులో ఉన్నా అది నేనే," అని తెలిపారు.
ఓజెంపిక్ వాడుతున్నారన్న ఆరోపణలపై తమన్నా కౌంటర్ ఇస్తూ.. "మహిళ శరీరం హార్మోన్ల కారణంగా మారుతుంది. నాకు కూడా 30ల్లో ఇన్‌ఫ్లమేషన్ అనిపించింది కానీ నా కర్వ్స్ ఎక్కడికీ వెళ్లవు. నేను సింధీని, నా హిప్స్, వెస్ట్ ఆ బోన్ స్ట్రక్చర్‌లోనే ఉన్నాయి. గ్లోబల్ బ్యూటీ స్టాండర్డ్స్ కోసం నేను నా రూపాన్ని మార్చుకోను"అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇదిలాఉంటే.. తాజాగా తమన్నా 'డూ యూ వన్నా పర్టనర్' వెబ్ సిరీస్‌లో నటించారు. ఇందులో డయానా పెంటీ, నకుల్ మెహతా, జావేద్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీ భాషల్లో పలు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











