Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దుబాయ్‌లో పాకిస్తాన్ క్రికెటర్‌తో తమన్నా.. వైరల్ అవుతున్న ఫోటో
టాలీవుడ్ మిల్కి బ్యూటీ తమన్నాకి సంబంధించిన గాసిప్స్ ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. ఓ వైపు సినీ ప్రముఖులు గాసిప్స్ బాధ తట్టుకోలేక చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతుంటే ఇంకా అలాంటి వార్తలే వస్తున్నాయి. సోషల్ మీడియాలో తమన్నా భాటియాకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ క్రికెటర్ తో అమ్మడు షాపింగ్ మాల్ లో దర్శనమిచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఓల్డ్ పిక్ వైరల్..
అసలైతే ఆ ఫోటో ఇప్పటిది కాదని స్పష్టంగా అర్ధమవుతోంది. తమన్నాతో పక్కన ఉన్నది దాయాది దేశమైన పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కావడంతో మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు కలిసి ఎప్పుడు ఎక్కడ కలిశారు అనే సందేహాలు అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. ఆ ఫోటో ఎంత వైరల్ అవుతున్నా కూడా మిల్కి బ్యూటీ పట్టించుకోలేదు. సాధారణంగా తమన్నా ఎలాంటి రూమర్స్ వచ్చినా పట్టించుకోదు.
అది నిజమే..
అసలైతే ఆ ఫోటో 2017లోనిది అని తెలిసింది. నిజానికి తమన్నాకు అబ్దుల్ రజాక్ కి ముందు నుంచి ఎలాంటి పరిచయం లేదు. అలాగే వార ఇప్పుడు స్నేహితులు కూడా కాదు. కావాలని ఆ ఫోటోని ఎడిట్ చేసారని కూడా మరికొన్ని రూమర్స్ వచ్చాయి కానీ అందులో కూడా నిజం లేదు. ఇది నిజమైన ఫోటోనే.. తమన్నా, అబ్దుల్ రజాక్ కలిసే అలా ఫోటోకి పొజిచ్చారు.
అసలు వివరాల్లోకి వెళితే..
ఒక ప్రముఖ బంగారం స్టోర్ లాంచ్ చేయడానికి వీరిద్దరు సెలబ్రెటీస్ గా వెళ్లారు. సదరు సంస్థ ప్రమోషన్స్ లో భాగంగానే వీరిద్దరిని దుబాయ్ కి రప్పించింది. దీంతో కలిసి ఇలా ఇద్దరు ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. అంతేగాని ఆ ఫోటోతో వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు. అలాగే తమన్నాకి అబ్దుల్ రజాక్ కి ముందు నుంచి పరిచయం ఉందని వస్తున్న గాసిప్స్ కూడా పూర్తిగా అబద్ధమే..
Recommended Video
సినిమాలతో బిజీగా..
నెక్స్ట్ మిల్కి బ్యూటీ తెలుగు తమిళ్ సినిమాలతో బిజీ కానుంది. తెలుగులో సీటిమార్ సినిమాలో నటిస్తోంది. గోపిచంద్ హీరోగా రూపొందుతున్న ఆ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే కన్నడ నుంచి కూడా ఈ బ్యూటీ ఆఫర్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.