బ్రేకప్ తర్వాత హద్దులు దాటేసిన తమన్నా.. అలాంటి డ్రెస్‌లో అరాచకం
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా - నటుడు విజయ్ వర్మల ప్రేమ బంధానికి అనూహ్య పరిణామాల మధ్య తెరపడిన సంగతి తెలిసిందే. త్వరలో శుభవార్త చెబుతారని అనుకుంటే బ్రేకప్ న్యూస్ చెప్పి షాకిచ్చింది ఈ జంట. సోషల్ మీడియాలో వీరిద్దరిపై వస్తున్న వార్తలు రూమర్స్‌గా ముద్ర వేద్దామంటే విజయ్ , తమన్నాలలో ఏ ఒక్కరు స్పందించడం లేదు. పైగా ప్రేమ, రిలేషన్, పెళ్లిపై మిల్కీ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అనధికారికంగా వీరి బంధం ముగిసినట్లేనని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
తన కెరీర్, వ్యాపారాలు తప్పించి మరో విషయం పట్టించుకోని తమన్నా.. రొమాంటిక్ సీన్స్‌లో కానీ, కనీసం లిప్ లాక్ సీన్‌లో కానీ నటించలేదు. విజయ్ వర్మతో ప్రేమలో పడ్డాక కాబోయే భర్తే కావడంతో అతనితో బెడ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది. వీరిద్దరి ప్రేమ బంధం ఎందుకు ముగిసింది? ఎలా ముగిసింది? ఎవరి వల్ల ముగిసింది ? అనేది నేటికీ ఒక సస్పెన్స్‌గా నిలిచింది. ప్రేమించే విషయంలో .. భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని యువతకు పిలుపునిచ్చారు తమన్నా.

టీనేజ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మిల్కీబ్యూటీ .. దాదాపు 20 ఏళ్లుగా స్టార్‌గా వెలిగిపోతూనే ఉన్నారు. తమన్నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేసినవాళ్లు ఫేడవుట్ అవ్వడమో, పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వడమో జరగ్గా ఆమె మాత్రం ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ఓదెల 2 చిత్రంలో తమన్నా నటిస్తున్నారు. ఇందులో అఘోరగా మిల్కీబ్యూటీ కనిపించనున్నారు. మహా కుంభమేళాను పురస్కరించుకుని వారణాసిలో విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఓదెల 2తో పాటు డేరింగ్ అనే పార్ట్‌నర్స్ అనే వెబ్ సిరీస్‌లో తమన్నా భాటియా నటిస్తున్నారు. ఇవి తప్పించి ఆమె కొత్తగా ఏ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే కొంత గ్యాప్ తీసుకుని తమన్నా సినిమాల్లో తిరిగి బిజీ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. బ్రేకప్ నేపథ్యంలో డిప్రెషన్‌లో కూరుకుపోయిన తమన్నా ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారు. ఇంట్లో పూజలతో పాటు ఆలయాలను సందర్శిస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తమన్నా భాటియా ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటారు. అయితే విజయ్‌తో బ్రేకప్ గురించి కానీ, తన కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. బ్రేకప్ తర్వాత ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న తమన్నా.. హాట్ హాట్ ఫోటో షూట్‌లలో పాల్గొంటున్నారు. ఫ్లోరల్ డ్రెస్‌లో వైట్ టాప్ వేసి ఎద అందాలను అరబోస్తూ ఆమె చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం తమన్నా అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











