Tamannaah Bhatia : మిల్కీబ్యూటీ గ్లామర్ ట్రీట్ .. అక్కడ ముడి విప్పిందో హీటెక్కి పోవాల్సిందే!

టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా.. కొంతమందికి ముద్దుగుమ్మలకి మాత్రమే స్టార్‌డమ్ వస్తుంది, కొందరే తమ అందం, అభినయంతో ఆడియన్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలరు. అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా ఒకరు. టీనేజ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ .. దాదాపు రెండు దశాబ్ధాలుగా నటిస్తూనే ఉన్నారు. తమన్నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేసినవాళ్లు ఫేడవుట్ అవ్వడమో, పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వడమో చేస్తుంటే ఆమె మాత్రం ఇప్పటికీ చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉంటున్నారు.

1989 డిసెంబర్ 21న ముంబైలోని ఓ సింధీ ఫ్యామిలీలో జన్మించారు తమన్నా భాటియా. తల్లిదండ్రులు సంతోష్, రజనీ. ఈమెకు అన్నయ్య ఆనంద్ భాటియా ఉన్నారు. మానెక్జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తమన్నా.. 13 ఏళ్ల వయసులోనే ప్రఖ్యాత పృథ్వీ థియేటర్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారు. 16 ఏళ్ల వయసులో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ మూవీ ద్వారా చిత్ర సీమలో అడుగుపెట్టారు తమన్నా. మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ చిత్రంతో తెలుగు వారిని పలకరించారు.

Tamannaah Bhatia PhotoShoot With Luna twisted Lever jersey maxi dress Her latest photos here

తర్వాత హ్యాపీడేస్, కాళిదాసు, రెడీ, నిన్న నేడు రేపు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, ఎందుకంటే ప్రేమంట, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఆగడు, బాహుబలి సిరీస్, ఊపిరి, సైరా, ఎఫ్ 3 వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలలో నటించారు తమన్నా. ఆమెలోని డ్యాన్సింగ్ స్కిల్స్‌ని ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే. ఎంతటి టఫ్ మూవ్‌మెంట్స్‌నైనా చాలా ఈజీగా చేసి శెభాష్ అనిపించుకున్నారు మిల్కీబ్యూటీ. ఆవిడతో డ్యాన్స్ చేయాలంటే కొందరు స్టార్స్ వామ్మో అనుకుంటారంటే అతిశయోక్తి కాదు.

తమన్నా పని అయిపోయిందనే కామెంట్స్ వినిపించినప్పుడల్లా తన మార్క్ చూపిస్తూ వస్తున్నారు. సౌత్‌లో మళ్లీ బిజీ అయిన ఆమె ఎఫ్-3, గుర్తుందా సీతాకాలం, భోళాశంకర్‌, జైలర్, అరన్మనై-4 .. హిందీలో భోలే చుడియాన్, మలయాళంలో బంద్రాలతో కమ్ బ్యాక్ ఇచ్చారు. రీసెంట్ బ్లాక్‌బస్టర్ స్త్రీ 2లో స్పెషల్ సాంగ్‌తో దేశాన్ని ఊపేసిన తమన్నా ప్రస్తుతం తెలుగులో ఓదెల -2తో బిజీగా ఉన్నారు తమన్నా.

ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తమన్నాపైనా ఎన్నో వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగానే నిలిచాయి. అయితే ఆమె తెలుగులో ఎంసీఏలో విలన్‌గా నటించిన ప్రముఖ నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌లో ఉన్నారు. త్వరలోనే వీరి పెళ్లి జరుగుతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తమన్నా.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా లెవర్ జెర్సీ మాక్సీ డ్రెస్‌లో తమన్నా ఫోటో షూట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన తమన్నా భాటియా కుర్రాళ్లకు సెగలు రేపుతున్నారు. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఈ ఫోటోలు చూసేయండి.

More from Filmibeat

Read more about: tamannaah bhatia movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X