త్రిషతో విజయ్ రిలేషన్‌పై రూమర్స్... దళపతిపై తమన్నా అలాంటి వ్యాఖ్యలు
గత కొంతకాలంగా ఇంటా బయటా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్. కరూర్ తొక్కిసలాట, జన నాయగన్ సినిమా విడుదల ఆగిపోవడం, త్రిషతో రిలేషన్‌పై రూమర్స్, తన భార్య సంగీత విడాకుల నోటీసుతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికి మించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవ్వగా.. ఎన్నికలకు ఎలా వెళ్లాలా? అన్న దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు.
కూటమిగా వెళ్లాలని పార్టీ నేతలు కోరుకుంటూ ఉండగా.. విజయ్ మాత్రం తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్లేది లేదని తేల్చేశారు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోగా.. సరిగ్గా ఇదే సమయంలో తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటున్న ఘటనలు విజయ్ ఇమేజ్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా తన రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని దళపతి, ఆయన అభిమానులు భావిస్తున్నారు. విజయ్ వ్యక్తిత్వంపైనా ఆయన రాజకీయ ప్రత్యర్ధులు నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దళపతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మిల్కీబ్యూటీ తమన్నా భాటియా.

దాదాపు 20 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తున్నారు తమన్నా భాటియా. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస ఆఫర్లతో ఎదురులేకుండా దూసుకెళ్తున్నారు. సినిమాలే కాకుండా ఐటెం సాంగ్స్‌తోనూ అలరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో భోలే చూడియన్, తెలుగులో దట్ ఈజ్ మహాలక్ష్మీ చిత్రాలలో మిల్కీ బ్యూటీ నటిస్తున్నారు. చాలా వరకు హిందీ సినిమాలలోనే నటిస్తున్న ఆమె దక్షిణాది చిత్రాలను కూడా ఒక చూపు చూసేందుకు సిద్ధమవుతున్నారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరు అగ్రహీరోలతో కలిసి నటించిన తమన్నా సమయం వచ్చినప్పుడల్లా వారి గురించి చెబుతుంటారు. తాజాగా.. ఇటీవల చెన్నైలోని ఓ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి మిల్కీబ్యూటీ చీఫ్ గెస్ట్‌గా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా తను పనిచేసిన నటీనటుల గురించి తమన్నా చెప్పి అభిమానుల్లో జోష్ తీసుకొచ్చారు. నా కెరీర్ స్టార్టింగ్‌లో బన్నీతో పనిచేశాను. ఆయన సినిమాల్లోనే కాకుండా బయట కూడా స్టైలీష్‌గా ఉంటారని తమన్నా తెలిపారు.
ఇక అజిత్ సార్‌తో తాను వీరం సినిమాలో కలిసి నటించా, ఆయన కేరవాన్‌లో ఇడ్లీలు వండి పెట్టారు. అజిత్ సార్‌కు కుకింగ్ అంటే చాలా ఇస్టం. ఆయన ఓ మంచి కుటుంబ సభ్యుడిలా ఉంటారని తమన్నా పేర్కొన్నారు. ఆ వెంటనే అభిమానులంతా దళపతి విజయ్ గురించి అడగటంతో వేదిక మొత్తం అరుపులు, కేకలు వినిపించాయి. విజయ్ సార్ చాలా సింపుల్‌గా ఉంటారు, మంచి మనసున్న వ్యక్తి, జెంటిల్మెన్. విజయ్, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తే మ్యాచ్ చేయడం కష్టం. వాళ్లిద్దరూ రిహార్సల్స్ చేయరు, వస్తారు స్టెప్ చూస్తారు డ్యాన్స్ చేసేస్తారు అని తమన్నా ప్రశంసించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దళపతి విజయ్ వ్యక్తిత్వంపై సొంత అభిమానులు, పార్టీ నేతలు, ప్రత్యర్ధుల నుంచి విమర్శలు వస్తున్న వేళ.. ఆయన ఎలాంటి వారు చెబుతూ తమన్నా చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వీడియోని విజయ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications

















