ఈడీ ఉచ్చులో హీరోయిన్ త‌మ‌న్నా.. 8 గంటల విచారణ.. అసలేం జరిగిందంటే?

Tamannaah Bhatia: టాలీవుడ్ హీరోయిన్ తమన్నా చిక్కుల్లో పడింది. ఎవరు ఊహించని విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్(ఈడి) విచారణను ఎదుర్కొంటుంది. దాదాపు 8 గంటల పాటు ఈడీ తమన్నాను విచారించింది. ఇంతకీ తమన్నా పై వచ్చిన ఆరోపణలు ఏంటి ? ఎందుకు తమన్నాను ఈడి విచారిస్తుంది?

అసలేం జరిగిందంటే..

నటి తమన్నా భాటియా కష్టాల్లో పడింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా పేరు తెరపైకి వచ్చింది. సినీ నటిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గౌహతి కార్యాలయంలో విచారించింది. అయితే.. తమన్నా భాటియాను నిందితురాలిగా విచారించలేదు. కానీ, ఈ మహాదేవ్ యాప్‌కు అనుబంధ యాప్ అయినా HPZ టోకెన్ మొబైల్ యాప్‏ను ప్రమోట్ చేయడానికి సంబంధించి తమన్నా వార్తల్లో నిలిచింది.

Tamannaah Bhatia Questioned By ED officers in connection with HPZ Token scam

హెచ్‌పిజెడ్ యాప్ స్కామ్‌లో తమన్నా భాటియాను ప్రశ్నించేందుకు ఈడీ పిలిచింది. దీంతో తమన్నా గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు గౌహతిలోని ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఆమె వెంట తన తల్లి కూడా ఉంది. ఇందులో తమన్నా పై ఎలాంటి నేరారోపణలు లేవు. కానీ కేవలం యాప్‏ను ప్రమోట్ చేశారనే కారణంతోనే విచారించినట్లు తెలుస్తోంది. యాప్‏ను ప్రమోట్ చేసినందుకు కొంత డబ్బు కూడా తీసుకున్నారని ఆమెపై ఎలాంటి నేరారోపణలు లేవని సంబంధిత వర్గాలు స్పష్టం చేశారు. ఈ మేరకు తమన్నా వాంగూల్మం తీసుకున్నారు.

HPZ టోకెన్ మొబైల్ యాప్ ద్వారా బిట్ కాయిన్, క్రిప్టోకరెన్సీల పేరుతో చాలామంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ లో రూ.57వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.4వేలు ఇస్తామని చెప్పి కోట్లాది రూపాయలను మోసం చేశారు. షెల్ కంపెనీల పేరుతో వివిధ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి, పెట్టుబడిదారుల నుంచి నగదు బదిలీ చేశారు. మహాదేవ్ యాప్‌తో HPZ కనెక్ట్ చేయబడింది. ఈ యాప్ లో (ఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్‌ అనేది మహదేవ్ యాప్ కు సంబంధించిందే ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను చూడడాన్ని ప్రచారం చేసింది.

Tamannaah Bhatia Questioned By ED officers in connection with HPZ Token scam

మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్,బెట్టింగ్ అప్లికేషన్ సపోర్టింగ్ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చట్టవిరుద్ధంగా వీక్షించడాన్ని ప్రోత్సహించినట్లు తమన్నాపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ సమన్లు ​​జారీ చేసింది. 'ఫెయిర్‌ప్లే' అనేది వివిధ క్రీడలు, వినోదాల ద్వారా జూదాన్ని ప్రోత్సహించే బెట్టింగ్ యాప్. ఇందులో క్రికెట్, పోకర్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్ కార్డ్ గేమ్‌ల వంటి గేమ్‌లలో అక్రమ బెట్టింగ్‌లు పెట్టేవారు.

శ్రద్ధా కపూర్‌ కూడా..

గత ఏడాది మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రకటనలలో కనిపించిన నటులు రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్‌లను కూడా ED ప్రశ్నించింది. బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై నిషేధం తర్వాత చాలా మంది బాలీవుడ్ తారలు స్కానర్ కిందకు వచ్చారు. పలు నివేదికల ప్రకారం.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో 17 మంది బాలీవుడ్ తారలు విచారించినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X