15 ఏళ్ల ఏజ్ గ్యాప్ .. అయితే ఏంటీ?.. హద్దులు దాటేశాం, తమన్నా సంచలనం

ప్రస్తుతం టాలీవుడ్‌ టూ బాలీవుడ్ మీడియాకు సెంటర్‌గా మారారు మిల్కీబ్యూటీ తమన్నా భాటియా. విజయ్ వర్మతో బ్రేకప్‌ తర్వాతి నుంచి ఆమె ఏం చేసినా? ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతోంది. మీడియా ఛానెల్స్ కూడా తమన్నా ఇంటర్వ్యూల కోసం తెగ వెంటపడుతున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు తమన్నా భాటియా. ఈ నేపథ్యంలో వయసు, రిలేషన్ , ఫ్రెండ్‌షిప్ వంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు తమన్నా భాటియా.

2 దశాబ్ధాల పాటు నటిగా కొనసాగడం అందులోనూ ఇంకా స్టార్ హీరోయిన్‌గా చెలామణి కావడం అంటే ఆషామాషీ కాదు.. నేటికీ తన మార్కెట్‌ను, క్రేజ్‌ను కాపాడుకుంటున్నారు తమన్నా. ఇక వయసు 40కి చేరువ అవుతున్నా వన్నె తరగని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు మిల్కీ బ్యూటీ. ఆమె కాల్షీట్ల కోంస దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. తమన్నా ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో ఓదెల 2తో పాటు, హిందీలో మరో చిత్రంలోనూ నటిస్తున్నారు.

Tamannaah Bhatia rasha Thadani friendship odela 2 actress on age gap with raveena tandon s daughter

లస్ట్ స్టోరీస్ 2లో తనతో నటించిన విజయ్ వర్మతో ప్రేమలో పడిన తమన్నా భాటియా ఆయనతో దాదాపు మూడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. కానీ ఏం జరిగిందో? ఏమో కానీ ఈ జంట విడిపోయి షాకిచ్చింది. త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన ఈ జోడీ ఇలా వేరు కావడం అభిమానులు, సినీ ప్రముఖులకు షాకిచ్చింది. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలవ్వాలని తమన్నా పట్టుబట్టగా.. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని విజయ్ వర్మ డిసైడ్ కావడమే ఈ జంట విడాకులకు కారణంగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నాటి నుంచి వీరిద్దరి దారులు వేరయ్యాయి.. ఈ బాధ నుంచి త్వరగానే కోలుకున్న విజయ్ , తమన్నాలు తమ రోజువారీ జీవితంలో తిరిగి బిజీ అయ్యారు.

ఇక ఇటీవల ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం సికిందర్. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. కాజల్ అగర్వాల్ కీలకపాత్ర పోషించారు. అయితే ఈ సినిమాలో సల్మాన్ - రష్మికల మధ్య 31 ఏళ్ల వయసు తేడా ఉండటం చర్చనీయాంశమైంది. రష్మికకు, ఆమె తండ్రికి లేని ఇబ్బంది మీకెందుకు అంటూ సల్మాన్ సైతం కాస్త సీరియస్ అయ్యారు. రష్మిక పెళ్లి చేసుకుని ఆమెకు కూతురు పుడితే ఆమెతో కూడా నటిస్తానని సల్మాన్ కుండబద్ధలు కొట్టారు. ఈ విషయంలో సల్మాన్‌కు సినీ ప్రముఖులు, అభిమానులు అండగా నిలుస్తున్నారు.

ఇక ఇదే సమయంలో తమన్నా భాటియా, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్‌ కుమార్తె రషా తడానీ ఫ్రెండ్‌షిప్, వారిద్దరి మధ్య ఉన్న వయసు తేడా గురించి కూడా వార్తలు వస్తున్నాయి. రషా కంటే తమన్నా 15 ఏళ్లు పెద్దది కావడంతో అంత చిన్న పిల్లతో మీకు స్నేహం ఏంటీ? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఈ వార్తలకు చెక్ పెట్టారు. రషా నేను ఓ పార్టీలో కలిశామని.. అలా మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందని, మేం చాలా సన్నిహితంగా ఉంటున్నామని తమన్నా తెలిపారు. వయసు విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని.. మనసుకు నచ్చినవాళ్లతో కాసేపు ఆనందంగా ఉండటంలో తప్పేం ఉందని మిల్కీబ్యూటీ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X