Tamannaah Bhatia: ఫాతిమాతో పీకల్లోతు ప్రేమలో విజయ్ వర్మ? తమన్నా షాకింగ్ పోస్ట్!
చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, ఎఫైర్స్, బ్రేకప్స్ సర్వసాధారణం. ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో? ఎవరు విడిపోతారో? చెప్పడం కష్టం. కొన్నేళ్ల వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగి రేపోమాపో పెళ్లి అనగా విడిపోయిన జంటలు టాలీవుడ్ టూ బాలీవుడ్‌లో ఎంతో మంది. వీరికి మరో కొత్త తోడు వెతుక్కోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. బాలీవుడ్ నటులు విజయ్ వర్మ- ఫాతిమా సనా షేక్ వ్యవహారం ఇప్పుడు అలాగే అనిపిస్తుంది.
తమన్నా- విజయ్ బ్రేకప్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో లస్ట్ స్టోరీస్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి కొన్నేళ్లు ఆమెతో డేటింగ్ చేశారు విజయ్ వర్మ. పార్టీలు, ఫంక్షన్లు, సినిమా ఈవెంట్స్, వెకేషన్లు ఇలా ఎక్కడ చూసినా వీరిద్దరూ కనిపించేవారు. ఈ ఏడాది సెలబ్రెటీ జంటలన్నీ వరుసపెట్టి పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో విజయ్- తమన్నా కూడా గుడ్ న్యూస్ చెబుతారని అంతా అనుకున్నారు. ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా తమన్నా - విజయ్‌లు విడిపోయారు.

తమన్నా- విజయ్ ఎందుకు విడిపోయారు
సోషల్ మీడియాలో ఫోటోలు డిలీట్ చేసుకోవడంతో బ్రేకప్ గురించి హింట్ ఇచ్చిన ఈ జంట.. ఒకే కార్యక్రమానికి జంటగా కాకుండా విడివిడిగా రావడంతో బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చేసింది. తమ ఫ్యామిలీ ఫ్రెండ్, బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇంట్లో జరిగిన హోలీ వేడుకలకు కూడా ఇద్దరూ విడివిడిగా రావడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లయ్యింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు? ఏ కారణం చేత విడిపోయిందో అంతు చిక్కక సినీ జనాలు షాకయ్యారు. పెళ్లి- కెరీర్ అనే రెండు బలమైన అంశాలే విజయ్- తమన్నాల బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టాయని వార్తలు వస్తున్నాయి.
దంగల్ నటితో క్లోజ్‌గా విజయ్
బ్రేకప్ తర్వాత తమన్నా, విజయ్‌లు సినిమాలతో బిజీ అయ్యారు. ఇలాంటి దశలో దంగల్ నటి ఫాతిమా సనా షేక్‌తో విజయ్ వర్మ క్లోజ్‌గా ఉండటం, రెస్టారెంట్ బయట కిస్సులు, హగ్గులతో హల్‌చల్ చేశారు. వీరి డేట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, సినీ జనాలు షాకయ్యారు. తమన్నాతో విడిపోయి రోజులు గడవకముందే మరో అమ్మాయిని ముగ్గులోకి దించాడంటూ విజయ్ వర్మపై ట్రోలింగ్ జరిగింది.
నేను సింగిల్ అన్న ఫాతిమా
విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నానంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మెట్రో ఇన్ డినో మూవీ ప్రమోషనల్ కార్యక్రమంలో ఫాతిమ స్పందించారు. తాను ఇప్పటికీ సింగిల్ అని క్లారిటీ ఇచ్చారు. ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే రిలేషన్ బాగుంటుందని అన్నారు. ఫాతిమా, విజయ్‌లు కలిసి ప్రస్తుతం పలు చిత్రాల్లో కలిసి నటిస్తున్నారు. అదే ఈ రూమర్స్‌కి కారణమని కొందరు అంటున్నారు.
తమన్నా పరోక్ష కామెంట్స్
అటు ఫాతిమా సనా షేక్‌తో విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై అతని మాజీ ప్రియురాలు, స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా స్పందించారు. విజయ్ పేరెత్తకుండా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంగుళాన్ని మనం పూర్తి చేయకపోవడం కూడా నమ్మకమేనని తమన్నా వ్యాఖ్యానించారు. ప్రతిక్షణం సంపూర్ణం కాకపోవచ్చు.. కానీ కొన్ని క్షణాలు మాత్రం ప్రశాంతంగా ఉండేందుకు ఉపయోగపడతాయని తమన్నా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తమన్నా హిందీలో రేంజర్, వ్యాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్, రోహిత్ శెట్టి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











