తమన్నా విజయ్ వర్మ ప్రేమకు కారణం ఈమెనే.. వాళ్ళని ఎలా కలిపిందంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆదరిస్తూనే ఉంది. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారింది. తన అందం, టాలెంట్, డాన్స్, యాక్టింగ్ స్కిల్స్ తో సినిమా సినిమాకు మంచి పేరు సంపాదించుకుంది. స్టార్ హీరోలకు జోడిగా నటించి ప్రశంసలు అందుకుంది. క్రమ క్రమంగా బిగ్ ప్రాజెక్టులో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
100% లవ్, రచ్చ, బద్రీనాథ్, బాహుబలి వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లోనూ నటించి దక్షిణాదిన సక్సెస్ఫుల్ హీరోయిన్ గా వెలుగొందింది. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో తమన్నా భాటియా దుమ్ము లేపుతోంది. రెండవ దశలో కాస్త బోల్డ్ కంటెంట్ ను ఎంచుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

ఇక ఇటీవల మాత్రం తమన్నా గురించి వస్తున్న వార్తల్లో బ్రేకప్ ఒకటి. బాలీవుడ్ నటుడు, నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసీఏ చిత్రం విలన్ విజయ్ వర్మతో తమన్నా భాటియా కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉందంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే తమన్నా భాటియా విజయ్ వర్మతో తరచుగా కనిపిస్తూనే ఉంది. పలు ఈవెంట్లలో జంటగా హాజరై వీరిద్దరూ ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూలోను ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఇంత వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనేది కన్ఫామ్ అయ్యింది అంటున్నారు.
ఇక ఇటీవల మాత్రం.. తమన్నా విజయవర్మ పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ... అభిప్రాయ భేదాలతో బ్రేకప్ కూడా చెప్పుకున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ వాటికి చెక్కు పెడుతూ రీసెంట్ గా జరిగిన హోలీ వేడుకల్లో ఇద్దరు కలిసి కనిపించారు. దాంతోను వీరిద్దరి బ్రేకప్ వార్తలకు బ్రేక్ పడింది. ఇంకా వారు ప్రేమలోనే ఉన్నారంటూ మరోసారి కన్ఫర్మ్ అయింది. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు కూడా వారి ప్రేమను కన్ఫామ్ చేసింది.
రవీనా టాండన్ కూతురు రాశా తడాని వీరిద్దరి గురించి మాట్లాడింది. మొదటగా తమన్నాను లైవ్ మ్యూజిక్ కాన్సెట్లో కలిసినట్లు చెప్పింది. ఆ ఈవెంట్లో రాశా తడాని డాన్స్ చేస్తుంటే తనతో తమన్నా కూడా వచ్చే జాయిన్ అయింది అని చెప్పింది. ఆ తొలి పరిచయంలోనే ఆమెతో ఎంతో మంచి రిలేషన్ ఏర్పడింది అని చెప్పింది. ఇక అదే ఈవెంట్లు విజయవర్మ కూడా తమన్నాకు కలిశారని చెప్పుకొచ్చింది. వారిద్దరూ ఆ తర్వాత చాలా క్లోజ్ గా ఉన్నారని కూడా స్పష్టం చేసింది.
ఆ తర్వాత నుంచి తమన్నా భాటియా, విజయ్ వర్మ తనను ఎంతో బాగా చూసుకుంటారని కూడా వివరించింది. అందుకే వారిని ఆమెకు గ్రాండ్ పేరెంట్స్ గా భావిస్తానని, వారు చూపించే ప్రేమ ఆ స్థాయిలో ఉంటుందని చెప్పుకొచ్చినట్టు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రాశా తడాని చెప్పిన మాటలతో తమన్నా భాటియా, విజయ్ వర్మ ఎలాంటి బ్రేకప్ లేకుండా హ్యాపీగా రిలేషన్ లో ఉన్నారని తెలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విజయ్ వర్మ ఇంట్లో కూడా తమన్నా పరిచయమైందని, కొద్ది రోజుల్లో పెళ్లి ఏర్పాటు కూడా చేయబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే తమన్నా కూడా కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదని అంటున్నారు. నెక్స్ట్ తమన్నా నుంచి ఓదెల2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











