బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన తమన్నా.. ముఖానికి ఏం రుద్దుకుంటుందో తెలిస్తే.. ఛీ అంటారు!
Tamannaah Bhatia Beauty Secret: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. ఈ మిల్క్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. వరుస విజయాలను అందుకని స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఆ స్టార్ డమ్ తోనే బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ కూడా తన అందం, అభినయంతో నార్త్ ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బ్యూటీ సీక్రెట్ ను బయట పెట్టింది తమన్నా. ఇంతకీ ఆ బ్యూటీ సీక్రెట్ ఏంటో మీరు కూడా తెలుసుకోండి మరి..
తమన్నా భాటియా.. మంచు విష్ణు నటించిన శ్రీ అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. అనతి కాలంలోనే తెలుగు సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడుకు హ్యాపీడేస్ సినిమాతో మంచి బ్రేక్ లభించింది. రెడీ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు .. ఇలా వరుస సినిమాలతో సూపర్ క్రేజ్ దక్కించుకుని తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఇలా టాప్ హీరోల సరసన సౌత్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది తమన్నా..

రజినీకాంత్ జైలర్ మూవీలో 'కావాలయ్యా..'అంటూ రెచ్చిపోయింది. గ్లామర్ షో తో టాక్ ఆఫ్ దీ సెన్సేషన్ గా హాట్ బ్యూటీ. ఆ తరువాత ఈ మిల్క్ బ్యూటీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. స్ట్రీ 2 సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి, కుర్రవాళ్లకు చెమటలు పట్టించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఫోకస్ పెట్టి.. ఈ వెబ్ సిరీస్ ల్లో తన గ్లామర్ షో చేస్తుంది.ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 19 ఏండ్లు అవుతున్నా తమ గ్లామర్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బ్యూటీ సీక్రెట్ ను రీవిల్ చేసింది మిల్కీ బ్యూటీ.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్నా బ్యూటీ సీక్రెట్ చెప్పేసింది. ముఖంలో గ్లో రావడానికి లాలాజలం (ఉమ్మి) చాలా ప్రయోజనకరంగా ఉంటుందని, అయితే దానిని అప్లే చేసుకునే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించాలని అన్నారు. ఇది ఆపిల్ సైడర్ వెనిగర్ తో మట్టి లాంటిది. నేను ఉమ్మిని ముఖం మీద ఎప్పటి నుంచి అప్లే చేసుకున్నానో గుర్తులేదు. కాస్త వింతగా ఉన్నా.. ఉదయం మీ స్వంత లాలాజలం (ఉమ్మి)ని మొటిమల మీద రాస్తే.. త్వరగా ఎండబెట్టే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఇది పనిచేస్తుంది.' అంటూ తన బ్యూటీ సిక్రెట్ రిలీవ్ చేసింది తమన్నా.

తమన్నా తన చర్మ రహస్యం గురించి మాట్లాడుతూ.. తాను చర్మాన్ని వీలైనంత సహజంగా ఉంచుతుంది. ఆమె సహజ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తాననీ, గంధం, కాఫీ, తేనె కలిపి అప్లే చేసుకుంటానని తెలిపింది. ఇది కాకుండా తమన్నా ఇంతకుముందు తన ముఖానికి శనగ పిండి, పెరుగు రాసుకునేవాడినని చెప్పింది. ప్రస్తుతం తమన్నా బ్యూటీ సిక్రెట్ నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











