తప్పు చేసిన సరే, అలా చెబితే సహించనంటున్న తమన్నా..

Tamannaah Bhatia: సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న నటి తమన్నా భాటియా. ఈ మిల్క్ బ్యూటీ టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. వరుస విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ స్టార్‌డమ్ తోనే బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అనుకున్నట్టుగానే నార్త్ లో కూడా తన సత్తా చాటుతోంది. అయితే.. తాజాగా బంధాల గురించి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమ అంటే ఏమిటి? భాగస్వామి నుంచి ఏం ఆశిస్తుందో, అలాగే ఏ కారణం వల్ల బంధాలు తెగిపోతాయో వెల్లడించారు.

హీరోయిన్ తమన్నా తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తమన్నా మాట్లాడుతూ.. "ప్రేమలో ఉన్నప్పుడు అబద్ధం చెప్పడం నాకు అస్సలు నచ్చదు" అని స్పష్టంగా చెప్పారు. "ఏదైనా తప్పు జరిగిందా? పొరపాటు జరిగిందా? లేదా సమస్య ఎదురైనా నేను దానిని అర్థం చేసుకుని పరిష్కరించడానికి వారికి అండగా ఉంటాను. ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాను. నువ్వు ఒక పెద్ద తప్పు చేసినా, నేను నీకు తోడుగా నిలబడతాను. కానీ, అబద్ధం చెబితే మాత్రం అస్సలు సహించను. అది అసహ్యం" అని ఆమె స్పష్టంగా చెప్పారు.

Tamannaah Bhatia Reveals Her Ultimate Relationship Deal-Breaker I Can t Tolerate Lies

తమన్నా చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. " కొంతమంది నా ముఖం మీద అబద్ధం చెబుతారు, కానీ నేను దాన్ని నమ్ముతానని అనుకుంటారు. అదే నాకు ఆగ్రహం కలిగిస్తుంది. నాకు అబద్ధం కంటే ఎక్కువ కోపం వచ్చే విషయమేమిటంటే.. నన్ను తెలివితక్కువగా భావించడం. ఇది కేవలం అబద్ధం గురించిన విషయం కాదు, నన్ను మీరు మోసం చేయాలని భావిస్తే.. నేను ఆ విషయాన్ని అసలు తట్టుకోలేను"అని వెల్లడించారు.

అలాగే తమన్నా తన జీవిత భాగస్వామి గురించి మాట్లాడారు. "నేను ఒక గొప్ప జీవిత భాగస్వామిగా మారడానికి ప్రయత్నిస్తున్నాను. ఆయనకు నేను అదృష్టంగా అనిపించేలా, అతనికి నేను వరంగా అనిపించేలా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరో నాకు జీవితంలో వస్తే, ఆయనకు ఇది గత జన్మలో చేసిన మంచి కర్మల ఫలితం అనిపించాలి. నేను ఆ స్థాయికి చేరడానికి కృషి చేస్తున్నాను. ప్యాకేజీ త్వరలో వస్తుంది" అని తెలిపారు. తాజా వ్యాఖ్యలతో బంధంలో నిజాయతీకి ఆమె ఎంత విలువిస్తారో స్పష్టమవుతోంది.

ఇదెలా ఉంటే.. 2023లో తమన్నా భాటియా, నటుడు విజయ్ వర్మతో ఉన్న స్నేహం ప్రేమలోకి మారిందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఓ పార్టీ సందర్భంగా ఇద్దరూ కలిసి కనిపించిన తర్వాత ఈ జంట గురించి డేటింగ్ రూమర్స్ వైరల్ అయ్యాయి. కొంతకాలం తర్వాత ఈ జంట తమ వెబ్‌సిరీస్ "లస్ట్ స్టోరీస్ 2" ప్రమోషన్ సమయంలో తమ ప్రేమను బహిరంగంగా అంగీకరించారు. అప్పటి నుంచి సోషల్ మీడియా ఈ జంట ఫోటోలు వైరల్ గా మారాయి.

ప్రొగ్రామ్స్, ఈవెంట్లలో వారు తరచుగా కలిసి కనిపించేవారు. ఈ ఇద్దరూ కొన్ని నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే అంతలోనే ఏమైందో ఏమో కానీ విజయ్ వర్మ, తమన్నా భాటియా బ్రేకప్ చెప్పుకుని, ఎవరి దారి వారు చూసుకున్నారనే రూమార్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి. అభిమానులు "తమన్నా నిజంగా హార్ట్‌ఫుల్ పర్సన్" అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X