చిన్నప్పుడే అదోలా చూసేవారు.. పురుషాధిక్యత సమాజంలో కష్టం.. తమన్నా షాకింగ్ గా!

తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి ఇంట్రడక్షన్ అవసరం లేని మిల్క్ బ్యూటి తమన్నా. ఎంతో కాలంగా సినిమాల్లో తనదైన శైలీలో సత్తా చాటుతూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇప్పటికీ హవా కొనసాగిస్తోంది. ఇక ఇటీవల హైదరబాదీ నటుడు విజయ్ వర్మ డేటింగ్, ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు జోరందుకున్న విషయం తెలిసిందే. అయితే తాను 15 ఏళ్లప్పుడు సినీ కెరీర్ ప్రారంభించినట్లు తెలిపిన తమన్నా భాటియా తను ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాల గురించి తాజాగా చెప్పుకొచ్చింది.

హీరోయిన్ గా కాకుండా..

హీరోయిన్ గా కాకుండా..

తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని హీరోయిన్ మిల్కీ బ్యూటి తమన్నా. మంచువారి హీరో మనోజ్ నటించిన శ్రీ సినిమా ద్వారా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఎప్పటి నుంచో తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఎంతోమంది అగ్ర హీరోలతో ఆడిపాడిన ఈ బ్యూటి విశేషమైన క్రేజ్ సంపాదించుకుంది. హీరోయిన్ గానే కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో అలరిస్తూ అభిమానులకు ఎంటర్టైన్ మెంట్ ఇస్తోంది.

గతేడాది విజవంతంగా..

గతేడాది విజవంతంగా..

మోస్ట్ గ్లామరస్ బ్యూటి తమన్నా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా హ్యాపీ డేస్ తో యువత హృదయాలను కొల్లగొట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లలో సుమారు 50కిపైగా చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ సినిమాల్లో కూడా ఆకట్టుకుంటూ తన సత్తా చాటుతోంది మిల్కీ బ్యూటి తమన్నా. ఇక గతేడాది తమన్నా సినీ కెరీర్ ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగింది. ఘని, F3, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం వంటి సినిమాలలో నటించింది.

లవ్ ట్రాక్ సాగిస్తున్నట్లు..

లవ్ ట్రాక్ సాగిస్తున్నట్లు..

స్టన్నింగ్ బ్యూటి తమన్నా ఈ 2023 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో సందడి చేయనుంది. అలాగే బోలే చూడియా, బాంద్రా వంటి హిందీ చిత్రాలతోపాటు లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లోనూ ఆకట్టుకోనుంది. అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ జైలర్ చిత్రం కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు, సిరీస్ లే కాకుండా ఇటీవల బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకు లిప్ కిస్ ఇచ్చి ప్రేమాయణం సాగిస్తున్నట్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.

 నటిని కావాలనుకున్నప్పుడు..

నటిని కావాలనుకున్నప్పుడు..

లవ్ ట్రాక్ తో ఇటీవల హైలెట్ అవుతున్న మిల్కీ బ్యూటి తమన్నా తాను 15 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినట్లు తెలిపింది. తన సినీ జీవితంలో ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్పందులు, పడిన కష్టాలు, అవమానాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "నటిగా మారాలి అనుకున్నప్పుడు చాలా మంది చిన్నచూపు చూశారు. స్కూల్ లో ఉన్నప్పుడు నేను నటిని కావాలనుకున్నప్పుడు జనాలు నన్ను అదోలా చూసేవారు. కానీ నేను అవేం పట్టించుకోలేదు" అని తమన్నా తెలిపింది.

వారిని చూసే ఇండస్ట్రీలోకి..

వారిని చూసే ఇండస్ట్రీలోకి..

ఇంకా తమన్నా మాట్లుడుతూ.. "స్కూల్ డేస్ లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టడంతో.. షూటింగ్స్ తోపాటు చదువును బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. బయటి వారు ఎన్ని మాట్లాడుకున్నా.. మా కుటుంబ సభ్యులు మాత్రం నన్ను బాగా ప్రోత్సహించారు. వారు నేను ఇండస్ట్రీలో బాగా రాణిస్తానని నమ్మేవారు. బాలీవుడ్ తారలు మాధురీ దీక్షిత్, కరీష్మా కపూర్, శ్రీదేవిని ఎంతో ఇష్టపడేదాన్ని. వారిని చూసి ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాను. తొలిసారి కమర్షియల్ యాడ్ లో నటించాను" అని పేర్కొంది.

సవాళ్లు ఎదురయ్యాయి..

సవాళ్లు ఎదురయ్యాయి..

"బోర్డ్ ఎగ్జామ్స్ సమయంలో కమర్షియల్ యాడ్ ఆఫర్ వచ్చింది. పగటి పూట షూటింగ్ లో పాల్గొని రాత్రి పూట చదువుకునేదాన్ని. నా సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. దేనికి తలవంచలేదు. నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎప్పుడూ వదులుకోలేదు. అవకాశాలు వస్తున్నప్పుడు కూడా సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని చూసి భయపడలేదు" అని తమ్ము బేబీ చెప్పుకొచ్చింది.

మహిళలు అనుకున్నవి..

మహిళలు అనుకున్నవి..

ఇంకా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కొనసాగిస్తూ.. "నా కుటుంబ సభ్యులు కూడా ఇతరుల నుంచి సవాళ్లను ఎదుర్కొన్నారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. పురుషాధిక్య సమాజాంలో మహిళలు తాము అనుకున్నవి సాధించడం అంతా ఈజీ కాదు. కానీ, నా పేరెంట్స్ సపోర్ట్ తో ఇండస్ట్రీలో రాణించాను" అని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X