Tamannaah Bhatia: ‘నా మనసు రెండుసార్లు ముక్కలయ్యింది’: తమన్నా సంచలన వ్యాఖ్యలు!

Tamannaah Bhatia: మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా.. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. ఆమె తెలుగుతో పాటు తమిళం, హిందీ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మంచు మనోజ్ హీరోగా వచ్చిన 'శ్రీ' అనే మూవీతో తెలుగు సినిమాకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత శేఖర్ కమలా డైరెక్షన్ లో వచ్చిన 'హ్యాపీ డేస్' అనే మూవీతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ హిట్ తో అప్పటినుంచి ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇండస్ట్రీలో దూసుకుపోయింది.

తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇటీవల డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన బాక్ మూవీలో నటించింది. ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీలో 'కావాలయ్యా..'అంటూ రెచ్చిపోయి.. గ్లామర్ షో లో టాక్ ఆఫ్ దీ సెన్సేషన్ గా మారింది ఈ మిల్కీ బ్యూటీ. ఈ మధ్యనే స్ట్రీ 2 సినిమాలో కూడా ఓ ఐటమ్ సాంగ్ నటించి కుర్రకారును చెమటలు పట్టించింది.

Tamannaah Bhatia Reveals Key Lessons From Her Two Major Heartbreaks

మిల్క్ బ్యూటీ తమన్నా సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 19 ఏండ్లు అవుతున్న చెక్కుచెదరని గ్లామర్ తన సొంతం. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సిరీస్ పై కూడా ఫోకస్ పెట్టింది. ఈ వెబ్ సిరీస్ తో తన అందాలు ప్రదర్శిస్తూ టాప్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఈ హాట్ బ్యూటీ తెలుగు,హిందీ, తమిళ్ అనే తేడా లేకుండా రప్ఫాడిస్తుంది.

ఇదిలా ఉంటే.. తమన్నా పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. గతేడాదిగా ఈ మిల్కీ బ్యూటీ ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటుడు విజయ్ వర్మతో లవ్ ట్రాక్ నడుపుతోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని బాలీవుడ్ మీడియాలో పలు హాట్ సోర్టీస్ సర్కిలేట్ అవుతున్నాయి. కానీ, ప్రస్తుతం తనకు మ్యారేజ్ చేసుకునే మూడ్‌లో లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన జీవితంలో రిలేషన్ షిప్ లో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.
తాను టీనేజ్ లో ఉన్నప్పుడే తొలిసారి ప్రేమలో పడ్డానని, కానీ కొన్ని కారణాలతో ఆ లవ్ బ్రేకప్ అయ్యిందనీ, తన లైఫ్ లో తన హృదయం రెండుసార్లు బ్రేకప్ జరిగిందని తెలిపింది.

Tamannaah Bhatia Reveals Key Lessons From Her Two Major Heartbreaks

తొలిసారి ఒక వ్యక్తి కోసం తనకు నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నచ్చలేదనీ, జీవితంలో ఏదో సాధించాలని, కొత్త విషయాలు అన్వేషించాలని భావించాననీ, ఆ కారణంగానే తొలి బంధం నిలువలేదని చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల తరువాత మరో వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నాననీ, కానీ అతడు నాకు కరెక్ట్ కాదనిపించిందన్నారు. అలాంటి వ్యక్తితో బంధమంటే ప్రమాదమని అర్థమైందనీ, అలా రెండో సారి తన హృదయం ముక్కలైందని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Read more about: tamannaah bhatia
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X