అతడితో పిలల్ని కనాలని ఉంది.. మనసులో కోరికను బయటపెట్టిన తమన్నా భాటియా

సౌత్ ఇండియన్ సినిమా నుంచి ఇప్పుడు నార్త్ లో పాగా వేసేసిన వేయడానికి చూస్తున్న పలువురు టాప్ మోస్ట్ హీరోయిన్స్ కొందరు ఉన్నారు. కానీ నార్త్ నుంచి వచ్చి సౌత్ లో మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకొని మళ్ళీ నార్త్ లోనే సెటిల్ అయ్యిన బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది మిల్కి బ్యూటీ తమన్నానే అని చెప్పొచ్చు. కాగా తమన్నాకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.

తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోస్ తో నటించేసి ఇపుడు బాలీవుడ్ లోకి వెళ్లి సెటిల్ అయ్యిపోయింది. కాగా హిందీలో పలు ఐటెం సాంగ్స్ సహా పలు బోల్డ్ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న తమన్నా ఓపెన్ గానే ప్రముఖ నటుడు విజయ్ వెర్మతో లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా అందరికీ తెలిసిందే. ,మరి వీరి బంధంపై ఒకరికొకరు చేసే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారుతాయి.

Tamannaah Bhatia reveals kids planning with lover vijay Verma

కాగా ఈ మధ్యనే విజయ్ వెర్మ తమ ఇద్దరివీ 5 వేలకి పైగా ప్రైవేట్ ఫోటోలు ఇప్పుడు వరకు ఒక్కటి కూడా బయటకి రాలేనివి ఉన్నాయని తెలిపారు. ఇక తాజాగా విజయ్ తో రిలేషన్ పై తమన్నా భాటియా చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆమె ఇటీవల ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ విజయ్ తో పిల్లలని కనడంపై ఓపెన్ అయ్యింది. అయితే తన మాటల ప్రకారం తనకి పిల్లలని కనడం అంతగా ఇష్టం లేదని అనిపిస్తుందని చెప్పాలి.

ఆమె మాట్లాడుతూ చిన్న పిల్లల్ని కనడం అనే అంశం ఎంతో ప్రత్యేకమైంది అని, వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం వారితోనే కలిసి ఉండడం వంటివి ఇలా చాలానే చెయ్యాల్సి ఉంటుంది అని నన్ను మా అమ్మ నాన్నలు చిన్నపుడు ఎంతో గారాబంగా పెంచారు అని ఆమె తెలిపింది. ఆ కన్న ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు.

Tamannaah Bhatia reveals kids planning with lover vijay Verma

మరి ఇప్పుడు పిల్లలు కావాలి అంటే ఆ ఫీలింగే మరోరకంగా ఉందని అందుకే పిల్లలని కనడం అనే అంశం నాకు కొంచెం భయం గానే ఉంటుంది అని కొన్ని ఎమోషన్స్ మూమెంట్స్ ని ఆమె పంచుకుంది. దీనితో తన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి బాలీవుడ్ నటుడు విజయ్ వెర్మతో తమన్నా తమ బోల్డ్ వెబ్ చిత్రం లస్ట్ స్టోరీస్ 2 నుంచి ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారింది.

అక్కడ నుంచి వీరి ప్రేమ కొనసాగుతుంది. అలాగే రీసెంట్ గానే తమన్నా తన ఫస్ట్ లవ్ ఆ తర్వాత లవ్ బ్రేకప్ పై కూడా చేసిన కొన్ని కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. ఇక మిల్కీ బ్యూటీ రీసెంట్ గానే బాలీవుడ్ భారీ గ్రాసర్ అండ్ "స్త్రీ 2" లో కేజ్రి హాట్ ఐటెం ని సాంగ్ చేసింది. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో ప్రస్తుతం దర్శకుడు సంపత్ నందితో "ఓదెల 2" అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ని చేస్తుంది. ఇది మినహా మిగతా అంతా బాలీవుడ్ లోనే పలు సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X