మ్యారేజ్ శుభవార్త చెప్పిన తమన్నా.. ప్రియుడితో పెళ్లి ఎప్పుడంటే?
సౌత్ ఇండియా సినిమా దగ్గర పరిచయం అయ్యి ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో కూడా ప్రాజెక్ట్ లు చేస్తున్న పలువురు స్టార్ హీరోయిన్స్ లో మిల్కి బ్యూటీ తమన్నా భాటియా కూడా ఒకామె. కాగా ఈమె టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించడమే కాకుండా చాలా కాలం టాప్ హీరోయిన్స్ లో ఒకటిగా నిలిచింది. అలా సౌత్ లో పలు భాషల్లో సినిమాలు చేసి హిందీ మార్కెట్ లోకి కూడా వెళ్ళింది.
అలా హిందీలో కూడా తమన్నా మంచి ఆఫర్స్ ని అందుకుంది. అయితే ఉండగా తమన్నా కి సౌత్ లో మెల్లగా ఆఫర్స్ తగ్గడంతో ఆమె పూర్తిగా నార్త్ కి పరిమితం అయ్యిపోయి పలు బోల్డ్ సిరీస్ లు కూడా చెయ్యడానికి వెళ్ళింది. అలా జీ కర్దా, లస్ట్ స్టోరీస్ లాంటి సిరీస్ లు కూడా ఆమె చేసింది. కాగా ఈ సిరీస్ లలో లస్ట్ స్టోరీస్ లో తనకు పార్ట్నర్ గా నటించిన ప్రముఖ నటుడు విజయ్ వెర్మ తో చాలా కాలం నుంచి డేటింగ్ లో ఉంది.

ఇద్దరు ఆ సిరీస్ నుంచే మంచి ఫ్రెండ్ అయ్యి నెస్ట్ ప్రేమలో పడ్డారని కూడా టాక్ ఉంది. అక్కడ నుంచి వీరిద్దరూ బహిరంగంగానే కనిపిస్తూ వచ్చారు. దీనితో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ అయ్యిపోయింది. అయితే వీరు రిలేషన్ మొదలు పెట్టి దాదాపు రెండు సంవత్సరాలు దాటింది కానీ ఇంకా పెళ్లి ఊసు లాంటివి ఎప్పుడూ రాలేదు. అయితే ఇపుడు ఫైనల్ గా తమన్నా పై ప్రెజర్ వస్తుందట.
ఆమెని తొందరగా పెళ్లి చేస్కోవాలి అని ఆమె ఇంట్లోనే తల్లిదండ్రులు ప్రెజర్ చేస్తున్నారట. ఇన్నేళ్ల రిలేషన్ షిప్ చాలు ఇక తమన్నా కి కూడా వయసు పెరుగుతుండడంతో వారు తొందరగా పెళ్లి చేసుకోవాలని తొందర పెడుతున్నారట. దీనితో తమన్నా కూడా ఓకే చెప్పినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సో దీనితో త్వరలోనే తమన్నా నుంచి ఆ పెళ్లి అనౌన్సమెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

మరి ఈ గుడ్ న్యూస్ ని తమన్నా ఎప్ప్పుడు షేర్ చేస్తుందో చూడాలి. కాగా ఇప్పుడు తమన్నా తెలుగులో దర్శకుడు సంపత్ నందితో "ఓదెల 2" అనే సినిమా చేస్తుంది. అలాగే హిందీలో స్త్రీ 2 ఇంకా వేదా అనే చిత్రాలు చేస్తుంది. కాగా తమన్నా రీసెంట్ గా తమిళ్ లో "బాక్" అనే హారర్ కామెడీ డ్రామాలో నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమ్ అవుతుంది. దీనికి ఇందులో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.


Click it and Unblock the Notifications











