అలాంటి సీన్‌కి నో చెప్పితే.. స్టార్ హీరో దారుణంగా తిట్టాడు..తమన్నా షాకింగ్ కామెంట్స్
మిల్కీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia). ఈ అమ్మడు గత రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతుంది. కొత్త హీరోయిన్లు ఎంతమంది వచ్చినా, తన అందం, అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ 'తమన్నాకు పోటీ లేదు' అనే స్థాయిలో నిలిచింది. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నది. ప్రస్తుతం ఈ భామ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సినిమాల కంటే స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా తమన్నా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్ పరంగా ప్రత్యేకమైన డాన్స్ నంబర్స్ ఆమె కెరీర్‌కు కొత్త మలుపు తిప్పాయి.
ఇటీవల సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ, కీలక పాత్రలు, సెలెక్టివ్ ప్రాజెక్ట్స్‌తో ముందుకెళ్తోంది. తెలుగులో 'ఓదెలు 2' లాంటి సినిమాలు చేసినా, ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్, వెబ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెంచింది. ఆమె చేతిలో 'ఓ రోమియో' వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. ఇలాంటి తమన్నా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారం రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని తొలిసారి ఓపెన్‌గా వెల్లడించింది. ఒక సౌత్ స్టార్ హీరో తనను అవమానించాడని, నోటికొచ్చినట్టు మాట్లాడాడని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

హీరోయిన్ తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఒక సినిమా షూటింగ్ సమయంలో నన్ను ఓ సీన్ చేయమన్నారు. ఆ సీన్ నాకు అసౌకర్యంగా అనిపించింది, కొంత ఇంటిమసీ ఇన్వాల్వ్ అయి ఉండటంతో నేను చేయను అని స్పష్టంగా చెప్పాను. అది ఆ హీరోకు అస్సలు నచ్చలేదు. వెంటనే అందరి ముందే గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. హీరోయిన్‌ను మార్చేయండి అని కూడా అన్నాడు' అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది.
ఇంతటితో ఆగకుండా, 'ఆ సమయంలో చాలా బాధగా అనిపించింది. కానీ ఎవరైనా మిమ్మల్ని అవమానించేలా మాట్లాడితే, మీరు అదే అవమానంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన సరిహద్దులు మనం కాపాడుకోవాలి' అని పేర్కొంది. అయితే ఆశ్చర్యకరంగా, మరుసటి రోజే ఆ స్టార్ హీరో తన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాడని కూడా తమన్నా వెల్లడించింది. అయితే.. తనని తిట్టిన స్టార్ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం తమన్నా బయటపెట్టలేదు. అయినప్పటికీ, ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని డార్క్ సైడ్‌ను మరోసారి తెరపైకి తెచ్చాయి.
హీరోయిన్‌లు ఎదుర్కొనే ఒత్తిడి, అసౌకర్య పరిస్థితులపై చర్చ మొదలైంది. ముఖ్యంగా 'నో' చెప్పినందుకే హీరోయిన్‌ను మార్చేయాలని అనడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలా కెరీర్‌లో ఎత్తుపల్లాలు చూసిన తమన్నా, ఇప్పుడు తన అనుభవాన్ని ధైర్యంగా బయటపెట్టి మహిళా నటులకు స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ఘటనపై ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో, అలాగే ఇలాంటి విషయాలపై మరింత ఓపెన్ డిస్కషన్ జరుగుతుందా? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.


Click it and Unblock the Notifications











