Tamannaah Bhatia: ప్రియుడితో తమన్నా ఘాటైన లిప్ లాక్.. కెమెరాల ముందే అర్ధనగ్నంగా సరసాలు!

తమన్నా భాటియా మిల్కీబ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంటోంది. టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన తమన్నా ఇటీవల కాలంలో బాలీవుడ్ పై కూడా కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అయితే తమన్నా గతంలో ఎప్పుడు లేని విధంగా ఘాటైన లిప్ లాక్ సీన్స్ తో షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అమ్మడు రొమాంటిక్ సీన్స్ తో కూడా దర్శనమివ్వనున్నట్లు టాక్. ఆ వివరాల్లోకి వెళితే..

అన్ని భాషల్లో నటిస్తూ..

అన్ని భాషల్లో నటిస్తూ..

తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో వర్క్ చేస్తున్న తమన్నా మహారాష్ట్రకు చెందిన అమ్మాయి. ముంబైలో సింధీ మాట్లాడే కుటుంబంలో జన్మించింది. అయినప్పటికీ తమన్నా తెలుగు తమిళ్ చక్కగా మాట్లాడుతుంది. 2005లో హిందీ చిత్రం "చాంద్ సా రోషన్ చెహ్రా"తో తన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించింది.

అలా తెలుగు ప్రయాణం

అలా తెలుగు ప్రయాణం

మంచు మనోజ్ శ్రీ అనే సినిమా ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. ఇక తమన్నా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం "హ్యాపీ డేస్" (2007)తో విస్తృతమైన గుర్తింపు పొందింది. తమన్నా తన కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రాలలో కనిపించింది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని రకాల విభిన్నమైన సినిమాలలో నటించింది.

బిగ్ మూవీస్

బిగ్ మూవీస్

తన నటనా నైపుణ్యంతో తమన్నా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయాన్ (2009), బాహుబలి: ది బిగినింగ్ (2015), బాహుబలి: ది కన్‌క్లూజన్ (2017), F2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019), అలాగే "సైరా నరసింహా రెడ్డి.. అనేక రకాల సినిమాలో నటించింది. తెలుగులో ఆమె దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

హిందీలో కూడా బిజీబిజీగా

హిందీలో కూడా బిజీబిజీగా

ఇక తమన్నా హిమ్మత్‌వాలా (2013) అనే సినిమాతో హిందీలో కమర్షియల్ గా మొదటి సక్సెస్ చూసింది. ఇక హమ్‌షకల్స్, ఎంటర్‌టైన్‌మెంట్, టుటక్ టుటక్ టుటియాతో సహా పలు హిందీ చిత్రాలలో కూడా నటించింది. ఇక అందులో చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, తమన్నా నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

అతనితో ప్రేమ పెళ్లి?

అతనితో ప్రేమ పెళ్లి?

ఇక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా తమన్నా భాటియా పలు వెబ్ సిరీస్ ల తో కూడా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇక గత కొంతకాలంగా అయితే తమన్నాకు సంబంధించిన కొత్త బాయ్ ఫ్రెండ్ న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. అతనితో ప్రేమలో ఉంది అని పెళ్లికి కూడా సిద్ధమైంది అని చాలా రకాల కథనాలు వెలువడుతున్నాయి.

ఘాటైన లిప్ లాక్ సీన్స్

ఘాటైన లిప్ లాక్ సీన్స్

ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉంది అని అతనితో చేయబోయే లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో ఘాటైన సన్నివేశాలలో తమన్న నటించబోతున్నట్లుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. అందులో తమన్న గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంటిమేట్ సీన్స్ లో లిప్ లాక్ సన్నివేశాలతో షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. పలు సన్నివేశాలలో ఆమె అర్థనగ్నంగా కూడా కనిపిస్తుందట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరో అప్డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X