మతులు పోగొడుతున్న తమన్నా.. టైట్ ఫిట్ డ్రెస్ లో అందాలు ఆరబోత.. నెవర్ బిఫోర్ అంతే!
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా భాటియా కొత్త భామల ఎంట్రీతో రేసులో వెనుకపడింది. ఇప్పుడు సీనియర్ హీరోల పక్కనే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడున్న కొత్త భామలతో పోటీ పడుతూ ఇంకా నేను కూడా ఫీల్డ్ లో ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఆమె అడపాదడపా హాట్ ఫోటోలు వదులుతూ నేనింకా లైన్ లోనే ఉన్నానని హింట్స్ ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు వదిలే ఆమె తాజాగా వదిలిన హాట్ ఫోటోషూట్ కూడా సంచలనం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

హిందీ సినిమాతో
ఉత్తరాది భామ తమన్నా భాటియాకి చిన్నతనం నుంచి సినిమాల మీద ఆసక్తి ఎక్కువ. అయితే ముందు హిందీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన తమన్నా కేవలం తెలుగు సినిమాల వల్లే నాలుగు రాళ్ళు సంపాదించుకోవడమే కాక మిగతా అన్ని భాషల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు తర్వాత ఎక్కువ తమిళ సినిమాల్లో నటించిన తమన్నా 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులోనే హిట్
అదే ఏడాది 'శ్రీ' సినిమాలో హీరోయిన్ గా తెలుగులో, ఆ తదుపరి ఏడాది కేడీ సినిమాతో హీరోయిన్ గా తమిళ్ లో అడుగు పెట్టింది. అయితే అన్ని బాషలలో ఎంట్రీ ఇచ్చినా ఆమెకు మొదటి హిట్ మాత్రం తెలుగులో వచ్చింది. శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమాలో మధు అనే కాలేజ్ స్టుడెంట్ గా వరుణ్ సందేశ్ సరసన నటించిన ఆమె ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు.

ఆఫర్స్ తగ్గడంతో
ఆ తర్వాత రెడీ, 100 % లవ్, ఊసరవెల్లి, కెమెరామెన్ గంగతో రాంబాబు, రచ్చ, బాహుబలి లాంటి సినిమాల్లో నటించిన ఆమె తెలుగులోనే కాక అన్ని బాషల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో కొత్త భామల ఎంట్రీతో ఆమె క్రేజ్ తగ్గింది అనే చెప్పాలి. చివరగా సీటిమార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమె గని సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కూడా మెరిసింది. కానీ అది అంతగా ఆకట్టుకోలేదు.

తాజా ఫోటో షూట్
ఇక ఆమె ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కాకుండా ఆమె చేసిన ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
అయితే ఎప్పటికప్పుడు తన అందచందాలను ఆరబోయడానికి సిద్ధంగా ఉండే తమన్నా తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మతులు చెడగొడుతుంది
మండు వేసవిలోనూ తమన్నా వేడెక్కించే ఫోటో షూట్లతో మతులు చెడగొడుతుంది. తాజాగా ఆమె బాడీ కాన్ లెదర్ డ్రెస్ లో దర్శనం ఇచ్చింది. స్కై బ్లూ లెదర్ బాడీ కాన్ డ్రెస్ లో తన తొడల అందాలు ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆమె అందాల విందు చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











