Tamannaah Bhatia స్పోర్ట్స్ బ్రాలో మిల్కి బ్యూటీ మాస్ స్టెప్పులు.. వరుణ్ సందేశ్‌కు, మరో హీరోయిన్‌కు సవాల్

దేశ సినీ పరిశ్రమలో సుమారు రెండు దశాబ్దాల కెరీర్‌తో మూడు పదుల వయసులో కూడా భారీ ఆఫర్లతో తమన్నా భాటియా జోరు కొనసాగిస్తున్నది. సినీ రంగంలోకి వస్తున్న కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఎప్పటికప్పుడు సినీ పరిశ్రమలో వస్తున్న మార్పులను అవలోకనం చేసుకొంటూ తనను మార్చుకొంటూ ముందుకెళ్తున్న మిల్కి బ్యూటీ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో వివరాల్లొ వెళితే..

 పాకిస్థాన్ క్రికెటర్‌తో డేటింగ్ అంటూ

పాకిస్థాన్ క్రికెటర్‌తో డేటింగ్ అంటూ

ఇటీవల కాలంలో తమన్నా భాటియా తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. పాకిస్థానీ క్రికెటర్‌ అబ్దుల్ రజాక్‌తో డేటింగ్ చేస్తున్నది. అతడిని వివాహం చేసుకోబోతున్నదనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే ఆ వార్తలను మిల్కి బ్యూటీ ఖండించింది. అలా ఆ వార్తలకు కాస్త బ్రేక్ తమన్నా బ్రేక్ వేసింది. అయితే ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోనే ఉద్దేశం లేదని.. ప్రస్తుతం కెరీర్ మీదే దృష్టిపెట్టానని చెప్పుకొచ్చింది.

 స్పెషల్ సాంగ్స్‌తో మిల్కి బ్యూటీ రచ్చ

స్పెషల్ సాంగ్స్‌తో మిల్కి బ్యూటీ రచ్చ

ఇక తమన్నా భాటియా వరుస ప్రాజెక్టులు, వరుస అవకాశాలను దక్కించుకొంటూ కెరీర్‌పరంగా దూసుకెళ్లున్నది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా బడా హీరోల ప్రక్కన స్పెషల్ సాంగ్స్‌లో నటించి మెప్పించింది. ఇటీవల కాలంలో సరిలేరు నీకెవ్వరు, కేజీఎఫ్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో మంచి క్రేజ్‌ను, అభిమానుల ఫాలోయింగ్‌ను పెంచుకొన్నది.

వెబ్ సిరీస్‌లతో రచ్చ చేస్తూ

వెబ్ సిరీస్‌లతో రచ్చ చేస్తూ

అలాగే సినిమా పరిశ్రమలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమన్నా భాటియా తనను, తన నటనను మార్చుకొంటున్నది. ఓటీటీ యుగంలో కీలకంగా మారిన వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ జోష్ పెంచింది. ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన 11th hour అలాగే, నవంబర్ డైరీస్‌లో నటించింది. ఇంకా పలు ప్రాజెక్టుల్లో నటించేందుకు చర్చలు జరుపుతున్నది.

గని మూవీలో స్పెషల్ సాంగ్

గని మూవీలో స్పెషల్ సాంగ్

ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్‌ నటించిన గణి చిత్రంలో తమన్నా భాటియా నటించింది. ఆమె నటించిన స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేయగా సోషల్ మీడియా, వెబ్ వీడియాలో వైరల్ అయింది. కొడితే సాంగ్‌లో మెరుపులు మెరిపించింది. బాక్సింగ్ స్పోర్ట్ నేపథ్యంలో సాగే పాటలో తమన్నా అందాలు ఆరబోసింది. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తుండగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీత అందించారు.

సోషల్ మీడియాలో డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో

ఇకవైపు కొడితే పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. ఆ పాటకు సంబంధించిన డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియోను తమన్నా తన ఇన్స్‌టాగ్రామ్‌లో వదిలింది. ఈ పాట మీకు ప్రేరణను అందిస్తుంది. మీ జీవిత లక్ష్యాలను ఈ సినిమా నిర్దేశిస్తుంది. అవకాశాలు మరింతగా అందుకొండి.. డ్యాన్స్ మోర్ డ్యాన్స్ అంటూ పోస్టు పెట్టింది. అంతేకాకుండా వరుణ్ సందేశ్, సయానీ మంజ్రేకర్‌కు ఛాలెంజ్ విసిరింది. ఈ ఛాలెంజ్‌ను వారు స్వీకరిస్తారా లేదో వేచి చూడాల్సిందే. ఈ పోస్టుకు ఇప్పటికే 5 లక్షలకుపైగా లైక్స్ పడ్డాయి.

తమన్నా భాటియా సినిమా కెరీర్ ఇలా..

తమన్నా భాటియా సినిమా కెరీర్ ఇలా..

ఇక తమన్నా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల సైరా నర్సింహారెడ్డి చిత్రంలో నటించింది. అలాగే ఆమె నటించిన దట్ ఈజ్ మహాలక్ష్మీ, అంధాదూన్ రీమేక్ మేస్ట్రో చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే హిందీలో నవాజుద్దీన్ సిద్దిఖీతో కలిసి బోలే చుడియాన్, అలాగే ప్లాన్ ఏ ప్లాన్ బీ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి నటించింది. తెలుగులో గుర్తుందా శీతాకాలం, చిరంజీవితో ఆచార్య చిత్రంలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X