బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా.. తేడాగా ఉన్నా వర్కౌట్ అవుతుందట!
మిల్కీ బ్యూటీ తమన్నా తన సౌందర్య రహస్యం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వినడానికి కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా ఆమె చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి నాలుగు పదుల వయస్సు దగ్గర పడుతున్న మిల్కీబ్యూటీ తమన్నా అందం ఏ మాత్రం తగ్గడం లేదు. బాడీ అలాగే మెయింటెయిన్ చేయడమే కాక ఫేస్ గ్లో కూడా తగ్గకుండా అనే ఆమె మెయింటెయిన్ చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె అందం వెనుక రహస్యం ఏమిటి అని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానాలు చెప్పింది.
మీ ఫేస్ గ్లోకి కారణం ఏమిటి అని ప్రశ్నించగా లాలాజలం(ఉమ్మి), మరీ ముఖ్యంగా 'ఉదయం లాలాజలం' నిజంగా చర్మ సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుందని వెల్లడించింది. తమన్నా ఒక ఇంటర్వ్యూలో చర్మ సమస్యలను నయం చేయడంలో లాలాజలం సహాయపడుతుందని, అయితే సమస్యల విషయంలో వైద్య నిపుణులను కూడా సంప్రదించమని ఆమె పేర్కొంది. అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ తో బంకమట్టి కలిపి రాసుకున్నా బాగానే ఉంటుందని వెల్లడించింది.

ఇక తన బ్యూటీ వెనుక ఉన్న సీక్రెట్ ను తమన్నా రివీల్ చేయడంతో ఈ అంశం మీద పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు మాత్రం ఛీ ఛీ అనుకుంటున్నా దాని విలువ తెలిసిన వాళ్ళు మాత్రం తమన్నా భలే సమాధానం చెప్పింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల డిస్నీ + హాట్‌స్టార్ సిరీస్ నవంబర్ స్టోరీలో కనిపించిన తమన్నా, తెలుగులో ఒక వంట కార్యక్రమానికి హోస్ట్‌గా ఆమె టెలివిజన్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె నితిన్, నభా నటేష్ నటించిన అంధధున్, యొక్క తెలుగు రీమేక్ మాస్ట్రోలో కూడా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











