Tamannaah bhatiya: అతన్ని నమ్మి మోసపోయా.. ఇప్పుడు అనారోగ్యంతో బాధ పడుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్!

తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా భాటియా ఇప్పుడు కొంత వెనుక పడింది. కొత్త భామల ఎంట్రీ ఇవ్వడమే కాక సరైన హిట్ సినిమాలు పడకపోవడంతో ఆమె రేసులో వెనకబడింది. అయితే సీటీమార్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే

కెరీర్ మొదలుపెట్టి

కెరీర్ మొదలుపెట్టి


హిందీ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఎక్కువగా తెలుగు సినిమాల్లో క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు తరువాత ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన తమన్నా 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, ఆ తదుపరి ఏడాది కేడీ సినిమాతో తమిళ్ లో అడుగు పెట్టింది. ఇక మొత్తం మీద తమన్నా దాదాపు 40 సినిమాల్లో నటించింది.

హ్యాపీ డేస్ తో బ్రేక్

హ్యాపీ డేస్ తో బ్రేక్

ఇక 2007లో తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమాలో తమన్నా మధు అనే కాలేజ్ అమ్మాయిగా నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ దెబ్బకు ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు. రెడీ, 100 % లవ్, ఊసరవెల్లి, కెమెరామెన్ గంగతో రాంబాబు, రచ్చ, బాహుబలి లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

కెరీర్ మొదలుపెట్టిం

కెరీర్ మొదలుపెట్టిం

ఇక ఈ మధ్య కాలంలో ఎందుకో కానీ ఆమె క్రేజ్ తగ్గింది. తెలుగులో చివరగా గోపీచంద్ హీరోగా వచ్చిన సీటీమార్ సినిమాలో ఆమె జ్వాలా రెడ్డి అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో ఆమె ఒక కబడ్డీ కోచ్ పాత్రలో నటించింది. అలాగే మాస్టర్ షెఫ్ పేరుతో తెలుగులో ఒక కుకింగ్ షోకి ఆమె హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

అనారోగ్యంతో బాధపడుతు

అనారోగ్యంతో బాధపడుతు

తమన్నా ఒత్తిడి కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. కసరత్తులు చేయడం వల్ల తాను ఎంతో ఒత్తిడికి గురి అయ్యేదాన్ని అని తమన్నా వెల్లడించారు. అయితే అందుకు కారణంగా తన కెరీర్ ఆరంభంలో ఓ డైటిషిన్‌ చెప్పిన విధానాన్ని తాను నమ్మడమే అని ఆమె బహిరంగంగా వెల్లడించింది. తన కెరీర్ ఆరంభంలో సదరు డైటీషియన్ చెప్పిన డైట్ ఫాలో అవ్వడం వల్ల తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అని ఆమె తెలిపింది.

 ఏ జబ్బుతో బాధపడుతోందో

ఏ జబ్బుతో బాధపడుతోందో

ఇక ఆమె ఆర్గానిక్ ఫుడ్ మరియు యోగా వంటి రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌లకు మారడం ద్వారా ఆమె జీవనశైలిలో తీవ్రమైన మార్పు తీసుకువచ్చినప్పటికీ, ఆలస్యంగా లిక్విడ్ డైట్‌కు మారిందని, ఇది అంతర్గతంగా ఇప్పుడు తనకు సహాయపడుతుందని పేర్కొంది. అయితే ఆమె ఏ జబ్బుతో బాధపడుతోందో ఆమె వెల్లడించలేదు. ఇక ఫ్రై ఫుడ్‌ ఐటమ్స్‌ మానేసి సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

Recommended Video

Jalsa Movie Philosophy And Review. it's 13 years for classic jalsa | Filmibeat Telugu
సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే


ఇక ఆరోగ్య సమస్యలు లేకుండా తమన్నా త్వరలో తిరిగి ట్రాక్‌లోకి వస్తుందని ఆశిద్దాం, నిజానికి అంతకుముందు, ఆమె ముఖం మీద ఉదయం లాలాజలం పూయడం అంటూ ఒక విచిత్రమైన చర్మ సంరక్షణ టెక్నిక్ గురించి చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే తమన్నా త్వరలో 'ఎఫ్3', 'దటీజ్ మహాలక్ష్మి' తదితర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X