‘పిల్లలు అన్నం తినాలంటే.. ఐటెం సాంగ్స్ చూపించండి’
బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు సినిమాలలో స్పెషల్ అట్రాక్షన్‌గా ఐటెం సాంగ్స్ ఉండేవి. వీటిలో నటించడానికి అప్పట్లో ప్రత్యేకంగా హీరోయిన్లు ఉండేవారు. ఇప్పుడు హీరోయిన్లే వీటిని చేయడానికి ముందుకు వస్తున్నారు. ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ వస్తుందో.. 5 నిమిషాల పాటకు అంత పారితోషికం రావడంతో హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ లిస్ట్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ముందు వరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పెషల్ సాంగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తమన్నా. ఈ వివరాల్లోకి వెళితే..
ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్
దాదాపు 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తమన్నా భాటియా కెరీర్‌లో పలు ఐటెం సాంగ్స్ చేశారు. కో అనే తమిళ్ చిత్రంలో తొలిసారిగా స్పెషల్ సాంగ్‌లో నర్తించారు తమన్నా భాటియా. తర్వాత అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవ కుశ, కేజీఎఫ్, సరిలేరు నీకెవ్వరు, గనీ, రైడ్ 2, జైలర్, స్త్రీ 2 తదితర చిత్రాల్లో తమన్నా భాటియా చేసిన స్పెషల్ సాంగ్స్ మాస్‌ని ఊపేశాయి. మత్తెక్కించే అందాలు, డ్యాన్స్‌లో ఎక్స్‌పర్ట్ కావడంతో తమన్నా అవలీలగా ఐటెం సాంగ్స్ చేసుకుంటూ పోతోంది. థియేటర్‌తో పాటు యూట్యూబ్‌లోనూ ఈ పాటలకు ఆదరణ లభిస్తోంది.

ఐటెం సాంగ్స్‌కు భారీగా రెమ్యునరేషన్
ఇక ఐటెం సాంగ్స్ చేసినందుకు కూడా బాగానే వెనకేస్తున్నారు తమన్నా భాటియా. హీరోయిన్‌గా చేస్తే ఒక్క సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్‌లో పారితోషికం తీసుకునే ఈ ముద్దుగుమ్మ.. ఐటెం సాంగ్‌కి కోటి నుంచి 2 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. స్త్రీ 2లోని ఆజ్ కీ రాత్, రైడ్‌లోని నషా సాంగ్స్ లేటెస్ట్‌గా దుమ్మురేపాయి. తమన్నాను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని పలువురు హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. శ్రీలీల, కాజల్ అగర్వాల్, సమంత వంటి స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
బాలీవుడ్‌పైనే ఫోకస్
ప్రస్తుతం రేంజర్, వీ వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్‌తో పాటు రోహిత్ శెట్టి సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నారు. ప్రస్తుతం ఇవి చిత్రీకరణ దశలో ఉన్నాయి. అలాగే డార్లింగ్ పార్ట్‌నర్స్ అనే వెబ్ సిరీస్‌లోనూ మిల్కీబ్యూటీ నటిస్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతం తమన్నా భాటియా సౌత్‌కు దూరంగా ఉంటూ బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మకు బ్రేకప్ ఇచ్చి ఇటీవల వార్తల్లో నిలిచారు తమన్నా భాటియా.
నా సాంగ్స్ చూస్తేనే పిల్లలు భోజనం చేస్తారు
అయితే ఐటెం సాంగ్స్ చేయడం అంత ఈజీ కాదంటున్నారు తమన్నా. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన సినిమాలు, స్పెషల్ సాంగ్స్ సెలక్షన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. తను చేసే సినిమాలు, పాటు ప్రేక్షకులపై ప్రభావం చూపేలా ఉండాల్సిందేనని చెప్పింది. తన సినిమాలు కేవలం జీవనోపాధి కోసం చేసేవి కావని తెలిపింది. ఓ పిల్లాడు మీ పాట చూస్తేనే భోజనం చేస్తున్నాడని ఎంతో మంది తల్లులు తనకు ఫోన్ చేసి చెప్పారని తమన్నా గుర్తుచేసుకుంది. స్త్రీ 2 చిత్రంలో తాను చేసిన ఐటెం సాంగ్ ఆజ్ కీ రాత్ పాటను పిల్లాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపింది. ఒకవేళ పిల్లలు భోజనం చేస్తూ నా సాంగ్‌ను చూస్తే అలాగే చూడనివ్వాలని మిల్కీ బ్యూటీ కోరారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











