‘హీరోయిన్లపై అలాంటి వివక్ష.. ఇండస్ట్రీలో ఆడేసుకుంటారు’
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లో వరుస చిత్రాలతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన తమన్నా భాటియా కాస్త రూటు మార్చి గ్లామర్ మెరుపులతో రచ్చ చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బోల్డ్ యాక్టింగ్ తో అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ మతులు పోగొట్టింది. అప్పటివరకు టాలీవుడ్ లో క్లీన్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా బాలీవుడ్లో అడిగిపెట్టి సంచలనంగా మారింది.
లస్ట్ స్టోరీస్ 2, జీకర్దా, వంటి సినిమాలు సిరీస్ లతో ఆడియన్స్ మైండ్ పోగొట్టింది. తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఈ హాట్ టాపిక్ గా మారింది. ఇక తమన్నా మాట్లాడిన విషయానికి వస్తే... చిత్ర పరిశ్రమలో హీరోయిన్లపై వివక్ష కొనసాగుతుందని ఆమె అభిప్రాయపడ్డట్టు తెలుస్తుంది. హీరోయిన్లకు వేతనాలు ఇచ్చే విషయంలో పలువురు ఆడేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మన సినిమాలకు ప్రస్తుతం మంచి పేరు దక్కుతున్నప్పటికీ, హీరోలకు దీటుగా హీరోయిన్లు పనిచేస్తున్నప్పటికీ సరైన వేతనం అందట్లేదు అన్నారు.

హీరోలకు సమానంగా హీరోయిన్లకు కూడా పారితోషికాలు ఇవ్వడంలో పలు సంస్థలు వివక్ష చూపిస్తున్నాయని అభిప్రాయపడింది. అంతేకాదు మిగిలిన విషయాలోనూ లింగ వివక్ష కొనసాగుతూనే ఉందని మండిపడింది. మహిళలు తమ హక్కుల కోసం పోరాడాలని సూచించింది. ఇప్పటికైనా ఇండస్ట్రీలో హీరోయిన్లకు హీరోలతో సమాన వేతనాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. హీరోలకు దీటుగా హీరోయిన్లకు క్రేజ్, మార్కెట్లో వారి సినిమాలకు డిమాండ్ ఉన్నప్పటికీ వేతన వ్యత్యాసంలో మాత్రం మార్పు రావడం లేదన్నారు.
విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో తమన్నా బాటియా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు అన్ని రంగాల్లోనూ తమ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని సూచించింది. అయితే తమన్నా వేతన వ్యత్యాసం పై మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే తను టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో పనిచేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తను ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా ఇండస్ట్రీలో మాత్రం హీరోయిన్లకు వేతనాల్లో, గుర్తింపులో హీరోలకు ఇచ్చే స్థాయిలో మాత్రం ఉండడం లేదని తెలిపింది. చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న లింగ వివక్ష ద్వారా చాలామంది చాలా రకాలుగా అవకాశాలను కోల్పోతూ ఉన్నారని తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఇదిలా ఉంటే తమన్నా భాటియా రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకుందని వార్తలు వచ్చాయి. కానీ హోలీ సెలబ్రేషన్స్ లో వాళ్లు కలిసి కనిపించడంతో వారి రిలేషన్షిప్ పక్కా అని మరోసారి కన్ఫర్మ్ అయింది. తమన్నా భాటియా నెక్స్ట్ ఓదెల 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి 'రచ్చ' డైరెక్టర్ సంపత్ నంది ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఓదేల రైల్వేస్టేషన్ కు ఇది సీక్వెల్. ఇప్పటికే టీజర్ కూడా విడుదలై మంచి రిజల్ట్ ను అందుకుంది.


Click it and Unblock the Notifications











