Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అతనితో డేటింగ్ ఏంటి.. చిరాకొచ్చేస్తోంది.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్నా
మిల్కి బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ దక్కించుకున్న బ్యూటీ తమన్నా భాటియా. గత కొన్నిరోజులుగా తమన్నాకు సంబంధించిన కొన్ని గాసిప్స్ బాగానే వైరల్ అవుతున్నాయి. ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా వాటి డోస్ తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఆ మధ్య ఒక విదేశీ క్రికెటర్ తో తమన్నా డేటింగ్ చేస్తోందని ఒక ఫోటో వైరల్ అయ్యింది. అనంతరం ఒక బిజినెస్ మెన్ తో కూడా లవ్ లో ఉన్నట్లు రూమర్స్ రాగా ఇటీవల పెళ్లిపై ఈ బ్యూటీ ఒక క్లారిటీ ఇచ్చేసింది.
అతనితో డేటింగ్..?
ఆ మధ్య పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రాజాక్ తో తమన్నా దర్శనమివ్వడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే అది కేవలం ఒక షాప్ ఓపెనింగ్ ప్రమోషన్స్ లో ఇద్దరు కలిసి దిగిన ఫోటో అని తర్వాత అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. తమన్నా కూడా పలుమార్లు ఆ ఫోటోపై వివరణ ఇచ్చింది.. అతనితో డేటింగ్ ఏంటి? అని.. 2017లో దుబాయ్ లో ఒక షాప్ ఓపెనింగ్ కోసమే కలిసి అలా ఫోటోకు పొజిచ్చినట్లు చెప్పింది.
చిరాకొచ్చేసిందట..
చాలా వరకు తమన్నా తన కెరీర్ లో పెద్దగా రూమర్స్ గురించి పట్టించుకోలేదు. డేటింగ్ లో ఉన్నట్లు ఎన్ని కథనాలు వెలువడినా కూడా ఆమె చాలా లైట్ గా తీసుకునేది. కానీ ఈ మధ్య మాత్రం కోలీవుడ్ ఇండస్ట్రీలో కాస్త రూమర్స్ ఎక్కువ కావడం వలన ఈ బ్యూటీకి చిరాకొచ్చేసిందట. అసలు ఈ గాసిప్స్ ఎవరు పుట్టిస్తారాని అమ్మడు ఆగ్రహం వ్యక్తం చేసిందట.
పెళ్లిపై ఫైనల్ క్లారిటీ..
అందుకే తమన్నా పెళ్లిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం లవ్, డేటింగ్ వంటి వాటితో బిజీగా ఉన్నట్లు టాక్ రాగా అలాంటిదేమి లేదని ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా లేదట. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని రెండేళ్ల అనంతరం పెళ్లి గురించి ఆలోచిస్తాను అని తమన్నా ఫైనల్ క్లారిటీ అయితే ఇచ్చేసింది.
Recommended Video
ఆ సినిమాలతో..
నెక్స్ట్ ఈ హీరోయిన్ తెలుగు తమిళ్ సినిమాలతో బిజీ కానుంది. తెలుగులో సీటిమార్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. గోపిచంద్ హీరోగా రూపొందుతున్న ఆ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే కన్నడ నుంచి కూడా ఈ బ్యూటీ ఆఫర్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.