ఆ ఒక్క తప్పుతో జీవితం తలకిందులు.. తమన్నా భాటియా షాకింగ్ కామెంట్స్
దాదాపు 20 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వెండితెరపై వెలుగొందుతున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. తనతో పాటు కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మలంతా పెళ్లి చేసుకోవడమో, ఫేడ్ అవుట్ కావడమో జరిగిపోయింది. కానీ తమన్నా మాత్రం ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తమన్నా డేట్స్ కోసం నిర్మాతలు పోటీపడుతున్నారు. తాజాగా జీవితంపై మిల్కీ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ వివరాల్లోకి వెళితే..
2005లో 16 ఏళ్ల వయసులో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు తమన్నా భాటియా. ఆ తర్వాత శ్రీ అనే మూవీ ద్వారా తెలుగువారిని పలకరించారు. ఈ దశలో హ్యాపీ డేస్ మూవీ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. పాల మీగడ లాంటి అందంతో మెరిసిపోయే తమన్నా కుర్రాళ్ల కలల రాకుమారిగా మారారు. కాళిదాసు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, రెబల్, గంగతో రాంబాబు, ఆగడు, బాహుబలి సిరీస్‌లతో అగ్రనటిగా దూసుకెళ్లారు తమన్నా. 20 ఏళ్ల కెరీర్‌లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో 89కి చిత్రాల వరకు నటించారు. ఈ జనరేషన్‌లో 20 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన నటిగా అరుదైన ఘనత సాధించారు.

కాలానికి తగినట్లుగా మారడంలో తమన్నా ఎప్పుడూ ముందున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్లిపోయారు. హీరోయిన్‌గా నటించాలని కూర్చోకుండా నెగిటివ్ రోల్స్ .. అవసరమైతే గెస్ట్ రోల్స్ కూడా చేసింది. ఇక ఐటెం సాంగ్స్‌కు తమన్నా కేరాఫ్‌గా మారారు. జైలర్, స్త్రీ 2, రైడ్ 2, స్పీడున్నోడు, సరిలేరు నీకెవ్వరు తదితర చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఇండస్ట్రీని షేక్ చేశారు. స్వతహాగా అందగత్తెతో పాటు డ్యాన్స్‌లో ఎక్స్‌పర్ట్ కావడంతో తమన్నాకు తిరుగులేకుండా పోయింది. ఐటెం సాంగ్స్‌కు కోట్లలో రెమ్యునరేషన్ వసూలు చేస్తూ ఇలా కూడా సంపాదించొచ్చా అని నిరూపించింది. ప్రస్తుతం హిందీలో భోలే చూడియన్, తెలుగులో దట్ ఈజ్ మహాలక్ష్మీ చిత్రాలలో మిల్కీ బ్యూటీ నటిస్తున్నారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను తమన్నా భాటియా నూటికి నూరు శాతం అమలు పరుస్తారు. తన సినిమాలకు భారీ పారితోషికాన్ని అందుకోవడంతో పాటు సంపాదించిన దానిని రియల్ ఎస్టేట్, జ్యువెలరీ, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ తన సంపాదనను రెట్టింపు చేసుకుంటున్నారు. ఇక పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటీనటులకు, ప్రేక్షకులకు ఆర్ధిక పాఠాలు చెప్పారు తమన్నా.
ఆర్ధిక క్రమశిక్షణ నాకు మా నాన్నగారు నేర్పించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో నా ఆర్ధిక వ్యవహారాలు ఆయనే చూసుకునేవారు. కొంచెం వయసు, అనుభవం వచ్చిన తర్వాత నేనే ఈ పనులు చూసుకుంటున్నా. ఇప్పటికీ ఎంతో మద్ధతు ఇస్తూ.. గైడ్‌గా ఉంటారు. ఆయన మార్గదర్శకత్వంలోనే రియల్ ఎస్టేట్, నగల వ్యాపారంతో పాటు పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాను. ఇవన్నీ భవిష్యత్తులో నాకు అండగా నిలుస్తాయి. ఆర్ధిక పరమైన విషయాలో దూరదృష్టి ఉంటేనే ప్రతి ఒక్కరి జీవితం అందంగా ఉంటుంది. ముఖ్యంగా సినీరంగంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. నటీనటులకు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడుతుంది.. దానిని సరైన మార్గాల్లో ఆదా చేయాలి. ఇందుకు మార్గాలు అన్వేషించాలి. ఏ చిన్న తప్పు చేసినా చివరికి ఏం మిగలదు అని తమన్నా భాటియా హెచ్చరించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











