Tamannaah Bhatia: చీరకట్టులో తమన్నా భాటియా కనికట్టు.. మతిపోయేలా అందాల అరబొత

ఓటీటీ అగ్ర సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో తమ సంస్థ కార్యక్రమాల విస్తరణ, కంటెంట్ ప్లానింగ్‌ను గణనీయంగా ప్రకటించింది. ముంబైలో అట్టహాసంగా జరిగిన వేడుకలో తమ కార్యాచరణను ప్రకటించింది. దాదాపు మల్టీ లాంగ్వేజ్ సిరీస్‌ల గురించి వివరంగా వెల్లడించింది. ప్రైమ్ ఇండియా విశ్వవాప్తంగా వృద్దని సాధించేందుకు ఇండియా కేంద్రంగా పనిచేస్తుంది. ఇటీవల కాలంలో కొత్త ఖాతాదారుల ఆకర్షించేందుకు కొత్త కంటెంట్ ప్లాన్స్‌ను ప్రకటించింది. ప్రధాన భాషల్లో కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఈ వేడుకలో వెల్లడించారు. ఈ వేడుకకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ముంబైలో గ్రాండ్‌గా జరిగిన ఈవెంట్‌లో దేశంలోని టాప్ స్టార్స్ అందరూ సందడి చేశారు. పూజా హెగ్డే, దుల్కర్ సల్మాన్, తమన్నా భాటియా, ఆలియా భట్, ఇతర స్టార్స్ తరలి వచ్చారు. అయితే తమన్నా భాటియా గ్లామర్ ప్రదర్శన గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతున్నది. చీరకట్టులో ఆమె అందాల ప్రదర్శనకు నెటిజన్లు ముగ్గులయ్యారు. అయితే మిల్కీ బ్యూటీ అందాల ప్రదర్శన, ఆమె గురించిన విషయాల్లోకి వెళితే..

Tamannaah Bhatia Amzaon Prime Video Bollywood

అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌లో మిల్కీ బ్యూటీ తన అందచందాలతో మెరిసింది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్‌తో కలిసి హంగామా చేసింది. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్‌ను అప్యాయతో కౌగిలించుకొన్న వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నది.

టాప్ స్టార్స్ తరలి వచ్చిన ఈవెంట్‌లో తమన్నా భాటియా తన గ్లామర్ తళుకులతో డామినేట్ చేసింది. మిల్కోవా షిఫాన్ సారీలో అందంగా ముస్తాబైంది. మల్టీకలర్ చీరలో అందాలను దాచేందుకు ప్రయత్నించింది. పసుపు, గులాబీ, నీలం, బ్లాక్ రంగులతో కూడిన చీర, స్లీవ్ లెస్ అండ్ లోనెక్ జాకెట్‌‌తో తన పరువాలను కెమెరా కాన్వాస్‌లపై పరిచింది.

తమన్నా వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా సైట్స్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మిల్కీ బ్యూటీని మించిన అందాల దేవత ఎవరైనా ఉంటారా? చెప్పండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె చర్మ సౌందర్య, అవయవ సౌష్టం ఆమెను మరింత అందంగా కనిపించేలా చేస్తున్నది. 36 ఏళ్ల వయసులో కూడా యువ హృదయాలను దోచుకొంటున్నది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

తమన్నా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ సినిమాను చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించి సికందర్ కా ముకద్దర్, న ఓదెల 2, రైడ్ 2 చిత్రాలు విడుదల అయ్యాయి. ఓ రోమియో సినిమాలో గెస్ట్ పాత్రలో నటించింది. ప్రస్తుతం పురుషాన్ అనే తమిళ సినిమాలోను, వీవాన్ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X