Tamannaah Bhatia మహేష్, ప్రభాస్, విజయ్ దేవరకొండతో మిల్కీ బ్యూటీ పోటీ.. తగ్గేదేలే అంటున్న తమన్నా!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేతి నిండా సినిమాలతో బిజీగా మారిపోయారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నారు. ఆమె నటించిన సినిమాలు వెబ్ సిరీస్‌లు గత రెండు మూడు నెలల్లో వరుసగా రిలీజ్ అయ్యాయి. చిరంజీవితో భోళా శంకర్, రజనీకాంత్‌తో జైలర్ లాంటి సినిమాల్లో నటించింది. ఓటీటీలో బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం లాంటి సినిమాల్లో నటించింది. ఇటీవల ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తమన్నా తమిళం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఆ సినిమా ఏంటి? ఆ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
తమన్నా భాటియా నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం అరణ్మనై 4 చిత్రం రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఇద్దరు పిల్లలను పట్టుకొని తమన్నా ఓ భారీ భవంతి ముందు నిలుచుని ఉంది. ఈ సినిమాకు సుందర్ సీ దర్శకత్వం వహిస్తున్నారు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాను అవ్నీ సినిమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కుష్బూ సమర్పిస్తున్నారు.

దెయ్యం కథ ఆధారంగా హారర్ సినిమాగా రూపొందుతున్న అరణ్మనై 4 మూవీ సినిమా పోస్టర్ చూస్తేనే భయంకరంగా ఉంది. ఈ సినిమాను సంక్రాంతి పండుగ రేసులో నిలిపేందుకు సుందర్ సీ, కుష్బూ ప్లాన్ చేశారు. ఈ పొంగల్ రేసులో తమన్నా భాటియా భాటియా కూడా నిలిచేందుకు రెడీ అవుతున్నది.
తమన్నా తన సినిమా పోస్టర్‌ను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అరణ్మనై 4 సినిమా పోస్టర్ ఇదే.. సీట్లకు అతుక్కుపోయి చూసేందుకు రెడీ అవ్వండి. ఈ సినిమా సంక్రాంతికి రీలీజ్ అవుతున్నది అని పోస్టు పెట్టింది. ఈ సినిమాకు ఈ కృష్ణమూర్తి సినిమాటోగ్రఫి, ఫెన్నీ అలివర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

సంక్రాంతి బరిలో స్టార్ హీరోలందరూ పోటీ పడుతున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గుంటూరు కారం, నాగార్జున నటిస్తున్న నా సామి రంగ చిత్రం, రవితేజ నటించిన ఈగల్, విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా సంక్రాంతి బరిలో నిలిచాయి. అయితే ఇవే కాకుండా ప్రశాంత్ వర్మ రూపొందించిన హనుమాన్, ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ కూడా సంక్రాంతి బరిలోనే నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగులోనే అగ్ర హీరోల మధ్య పోటీ కనిపిస్తుండగా.. మధ్యలో తమన్నా భాటియా కూడా దూరింది. తమిళంలో ఇతర సినిమాలతోపాటు తెలుగులో భారీ సినిమాలతో ఈ మూవీ పోటీ పడేందుకు సిద్దపడటం ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో తమన్నా హిట్ కొడుతుందా? లేదా చూడాలి.


Click it and Unblock the Notifications











