ఎంత దూరంగా ఉన్నా.. అలాంటి బంధాలు ఎప్పటికీ తెగిపోవు.. తమన్నా ఎమోషనల్!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో తనదైన ముద్ర వేసిన తమన్నా.. స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా తమన్నా భాటియా మరోసారి తన సోషల్ మీడియా పోస్టుతో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, తన వ్యక్తిగత జీవితంలో మధురమైన క్షణాలను అభిమానులతో పంచుకోవడం ఆమెకు అలవాటే. తాజాగా తమన్నా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటీ?

అల‌నాటి హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. గోవాలోని ఓ రిసార్ట్‌లో జ‌రిగిన పెళ్లికి హీరోయిన్ త‌మ‌న్నా (Tamannaah Bhatia ) హజ‌రైంది. ఆ వివాహ వేడుకలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో తమన్నా, తన తోటి నటి త్రిషా కృష్ణన్‌తో కలిసి దిగిన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ముఖ్యంగా వీరిద్దరూ ధరించిన సంప్రదాయ బంగారు రంగు పట్టు చీర అందరి దృష్టిని ఆకర్షించింది. వారి ఆభరణాలు ఆమె సంప్రదాయ దుస్తులకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి. అయితే ఈ ఫొటోల కంటే వాటికి ఆమె రాసుకొచ్చిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tamannaah Bhatia s Emotional Post Goes Viral Says Some Bonds Never Fade Away

తమన్న తన పోస్టులో "ఫెయిరీటేల్స్ (అద్భుత కథలు) నిజంగానే ఉంటాయి... ఈరోజు నేను అలాంటిదే ఒకటి చూశాను" అనే మాటలతో తన పోస్టును ప్రారంభించింది. అభిమానులను కూడా ఆ అందమైన వేడుకలోకి ఆహ్వానించింది. "మీరు కూడా ఈ అందమైన క్షణాలను చూడాలంటే స్వైప్ చేయండి" అంటూ వరుస ఫొటోలను షేర్ చేసింది. పెళ్లి వేడుకలోని ప్రతి క్షణం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని, అక్కడ చూసిన కొన్ని దృశ్యాలు తనకు హర్ట్ టచ్చింగ్ గా మారాయని వెల్లడించింది. ఈ సందర్భంగా బంధాలు, స్నేహితుల గురించి కూడా తమన్నా స్పందిస్తూ.. 'కొంతమంది వ్యక్తులు ఎంత దూరంలో ఉన్నా, ఎంత తక్కువగా కలిసినా... మన జీవితంలో ఎప్పటికీ అలాగే అనుబంధంగా ఉంటారు" అంటూ ఎమోషనల్ అయ్యారు.

అలాగే "జీవిత ప్రయాణంలో దొరికే స్నేహితులే అత్యంత విలువైన వారు. అలాంటి స్నేహితులే చివరికి కుటుంబ సభ్యుల్లా మారిపోతారు" అని పేర్కొంది. వెడ్డింగ్ వేడుకలో జరిగిన సరదా క్షణాలను గుర్తు చేసుకుంటూ 'కొంచెం మస్తీ, అల్లరి తప్పనిసరి'అంటూ నవ్వులు పంచుకుంది. అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, "ఎప్పటిలాగే సుందర్ సర్ మొత్తం వేడుకను అద్భుతంగా నడిపించారు" అని కొనియాడింది. మరోవైపు ప్రముఖ కొరియోగ్రాఫర్ బ్రిందాతో కలిసి ఫొటోలు దిగినందుకు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ, 'చివరికి బ్రిందా అక్కతో కూడా ఫొటోలు దిగే అవకాశం దొరికింది'అని తెలిపింది.

ఈ పెళ్లి వేడుకలో అందరూ ఒకే కలర్ థీమ్‌కు అనుగుణంగా సిద్ధమవడం తనను ఎంతగానో ఆకట్టుకుందని తమన్నా వెల్లడించింది. అంతేకాదు, తాను స్వయంగా డిజైన్ చేసిన ఫైన్ జ్యువెలరీని ధరించడం కూడా తనకు ఎంతో గర్వంగా అనిపించిందని చెప్పింది. 'ఒకరోజు నేను రూపొందించిన నగలను నేనే ధరించి ఇలా ప్రత్యేక సందర్భంలో కనిపిస్తానని ఎప్పుడూ అనుకోలేదు'అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం తమన్నా షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X