తడిసి ముద్దైన తమన్నా భాటియా.. మిల్కి బ్యూటీ తొలి అనుభవం అలా..

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. దక్షిణాది సినీ ప్రేక్షకులకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు సుపరిచితం. దాదాపు 20 ఏళ్లుగా తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అందం, అభినయం, డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులు, ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ తన క్రేజ్‌ను కొనసాగిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తమన్నా చాలా యాక్టివ్‌గా ఉంటారు. షూటింగ్‌ల మధ్య విరామం దొరికినప్పుడల్లా తన పర్సనల్ లైఫ్ లోని స్వీట్ మెమోరీస్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అలా తాజాగా తమన్నా షేర్ చేసిన ఓ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. నగరమంతా వర్షపు చినుకులతో తడిసిపోయింది. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఈ అందమైన వాతావరణాన్ని ఇంట్లో కూర్చొని చూడకుండా తమన్నా నేరుగా తన ఇంటి బాల్కనీలోకి వెళ్లి, వానలో తడుస్తూ ఎంజాయ్ చేసింది తమన్నా. ఎలాంటి మేకప్ లేకుండా, ఎంతో సహజంగా వర్షపు చినుకులను ఆస్వాదిస్తూ చిన్నపిల్లలా నవ్వుతూ కనిపించింది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఆమె హావభావాలు వీడియోకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Tamannaah Bhatia s Rain Video Goes Viral her Video Crosses 2 Million Views Online

ఈ వీడియోలో తమన్నా తొలి వర్షపు జల్లుల్లో పూర్తిగా తడిసిపోయింది. చల్లని గాలికి గజగజ వణుకుతున్నా కూడా ఆ క్షణాలను ఆస్వాదిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ ట్రిప్స్, ఖరీదైన లొకేషన్ల ఫొటోలు షేర్ చేస్తుంటారు. కానీ తమన్నా మాత్రం చిన్న చిన్న క్షణాలను కూడా ఎంతో అందంగా అభిమానులతో పంచుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తమన్నా వీడియోకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోకు ఇప్పటికే 2 మిలియన్ పైగా వ్యూస్ రావడం విశేషం. వేలాది మంది అభిమానులు లైక్స్, కామెంట్లతో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో అభిమానులు రెయిన్ క్వీన్, మిల్కీ బ్యూటీ అందానికి వర్షం తోడైంది అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమన్నా సోషల్ మీడియాలో కేవలం గ్లామర్ ఫొటోలకే పరిమితం కాకుండా, తన వ్యక్తిగత జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ట్రావెల్, ఫిట్‌నెస్, ఫ్యాషన్, షూటింగ్ లొకేషన్లు, కుటుంబ సభ్యులతో గడిపిన సమయం వంటి అనేక విషయాలను తరచూ పోస్ట్ చేస్తుంటారు. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులతో ఈ విధంగా కనెక్ట్ అవ్వడం వల్ల ఆమె ప్రతి పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ అవుతోంది.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులు, స్పెషల్ అప్పియరెన్స్‌లు, డ్యాన్స్ నంబర్ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. గత కొంతకాలంగా కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది. గ్లామర్‌తో పాటు నటనకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ కెరీర్‌ను సక్సెస్ పుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు.

Read more about: tamannaah bhatia tollywood mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X