6 నిమిషాలకు 6 కోట్ల రెమ్యునరేషన్.. తమన్నాకు డిమాండ్ మాములుగా లేదుగా!
Tamannaah Bhatia remuneration: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'శ్రీ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ మిల్క్ బ్యూటీ, ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. వరుస విజయాలను అందుకని స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఆ స్టార్ డమ్ తోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడ కూడా తన అందం, అభినయంతో నార్త్ ఆడియన్స్ కూడా మెప్పించింది. ఇలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నది ఈ స్టార్ హీరోయిన్. ఇప్పుడు ఈ అమ్మడి రెమ్యూనరేషన్ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో మూడు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తనకంటూ ప్రత్యేక మార్కెట్ క్రియేట్ చేసుకుంది. తమన్నా సినిమాలే కాకుండా.. ఇటీవలి కాలంలో స్పెషల్ సాంగ్స్ లో కూడా స్టెప్పులేస్తూ.. ఓ రేంజ్‌లో పాపులరిటీ తెచ్చుకుంది. ముఖ్యంగా జైలర్ (Jailer)సినిమాలోని 'కావాలయ్యా' అనే పాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే 'జై లవకుశ' లోని 'స్వింగ్ జరా' పాటతో ఆమె ఐటమ్ సాంగ్స్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ పాటలు మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్‌లో నిలవడమే కాకుండా, సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్స్‌గా మారాయి.

అలాగే.. బాలీవుడ్ మూవీ రైడ్ 2 (Raid 2)లో తమ్మన్నా చేసిన 'నషా' స్పెషల్ సాంగ్ కూడా అదే స్థాయిలో వైరల్ అవుతోంది. 'ఆజ్ కి రాత్' స్టైల్‌లో తెరకెక్కిన ఈ పాటలో ఆమె డ్యాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు సుమారు రూ.5 కోట్లు తీసుకుందన్న టాక్.. గతంలో జైలర్ సినిమాలోని పాట కోసం తమ్మన్నా సుమారు రూ.3 కోట్లు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆమె చేసిన పాటలు సూపర్ హిట్ అవుతుండటంతో, ఆమె రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో పెరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. తమన్నా తన రెమ్యూనరేషన్ ను మరోసారి పెంచేసిందట.. తాజాగా ఇటీవల గోవాలో జరిగిన ఓ ఈవెంట్ లో 6 నిమిషాల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌కి రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందట. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అంటే నిమిషానికి దాదాపు రూ.1 కోటి అన్నమాట. ఈ రేంజ్ డిమాండ్ చూసి సినీ అభిమానులు షాక్ అవుతున్నారు. 'ఇది తమన్నా స్టార్ పవర్'' ఇది తమన్నా డిమాండ్ 'అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, సినిమాలతో పాటు ప్రైవేట్ ఈవెంట్లు, కార్పొరేట్ షోలు, వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో తమన్నా డ్యాన్స్ అంటే నిర్వాహకులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఆమె స్టేజ్‌పై అడుగుపెట్టగానే ఆ ఈవెంట్‌కు వేరే లెవెల్ క్రేజ్ వస్తుందని, ప్రేక్షకులను కట్టిపడేసే పవర్ ఆమెకుందని నిర్వాహకులే చెబుతున్నారు. అందుకే తమన్నాను ఇప్పుడు కేవలం హీరోయిన్‌గా కాకుండా 'ప్రీమియం పెర్ఫార్మర్', 'స్టేజ్ బ్రాండ్'గా చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











