Tamannaah Bhatia : ఒళ్లంతా గులాబీలతో కవర్ చేస్తూ .. కిల్లింగ్ లుక్స్‌లో మిల్కీబ్యూటీ!
ఈ జనరేషన్‌లో 20 ఏళ్లకు పైగా ఓ హీరోయిన్ కెరీర్ కొనసాగించడమంటే అది అసాధ్యమనే చెప్పాలి. రెండు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో ఉండటమే కాదు.. ఇప్పటికీ స్టార్‌గా కొనసాగడం కొందరికే చెల్లింది . వారిలో నయనతార, అనుష్క, త్రిష, కాజల్ అగర్వాల్ వంటి కొందరికీ సాధ్యమైంది. ఈ కోవలోకే వస్తారు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ స్టార్ డమ్‌ను నిలబెట్టుకుని అగ్రనటిగా కొనసాగుతున్నారు.

15 ఏళ్లకే హీరోయిన్‌గా తమన్నా
2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన తమన్నా.. అదే ఏడాది తెలుగులో శ్రీ సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతో పాటు కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టి అక్కడా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 20 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ భాషల్లో నటించారు తమన్నా భాటియా. ఈ ఏడాది ఇప్పటికే ఓదెల 2, రైడ్ చిత్రాలతో అలరించిన మిల్కీ బ్యూటీ ప్రస్తుతం రేంజర్, నో ఎంట్రీ 2, ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్, రోహిత్ శెట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ కూడా హిందీ సినిమాలు కాగా.. ఆమె సౌత్‌ను పక్కనపెట్టేసి పూర్తిగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది.
ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్‌గా
హిందీలో హీరోయిన్ అయినా, గెస్ట్ రోల్ అయినా , ఐటెం సాంగ్ అయినా వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. గతేడాది స్త్రీ 2లో తమన్నా చేసిన ఐటెం సాంగ్ యూత్‌ను ఊపేయగా తాజాగా రైడ్‌లో ఆమె చేసిన నషా సాంగ్ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. గత పాటలతో పోలిస్తే రైడ్ 2లో తమన్నా అందాలు, స్టెప్స్, లుక్స్ ఉండటంతో కుర్రాళ్లను ఊపేస్తోంది. దీంతో ఐటెం సాంగ్స్‌కు తమన్నా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ఐదు నిమిషాల సాంగ్ కోసం తమన్నా కూడా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
విజయ్- తమన్నాల బ్రేకప్
ఈ ఏడాది తమన్నా భాటియా పెళ్లి పీటలెక్కుతారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రియుడితో విడిపోయి షాకిచ్చింది మిల్కీ బ్యూటీ. గత కొద్దిరోజులుగా భారతీయ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది తమన్నా - విజయ్ వర్మ బ్రేకప్. గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట బ్రేకప్ చెప్పుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వీరి మధ్య మనస్పర్ధలకు, దూరానికి దారి తీసిన కారణాలు ఇంత వరకు తెలియరాలేదు. కానీ ఎవరికి నచ్చిన విధంగా వారు కథలు అల్లేస్తున్నారు.
హాట్ హాట్ ఫోటో షూట్‌లతో తమన్నా వైరల్
పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలని తమన్నా నిర్ణయించుకోగా.. విజయ్ మాత్రం కెరీర్‌పై ఫోకస్ చేయాలని డిసైడ్ అవ్వడమే వీరి బ్రేకప్‌కు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రియుడితో విడిపోయిన తర్వాత ఆ బాధ నుంచి త్వరగానే కోలుకున్న తమన్నా తిరిగి తన సినిమాలు, షూటింగ్స్ ఇతర కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. వరుసపెట్టి ప్రాజెక్ట్‌లకు సైన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తమన్నా భాటియా ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు, ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో ఆమె కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తారు. తాజాగా గులాబీల ప్రింటింగ్‌తో ఉన్న మోడ్రన్ ఔట్‌ఫిట్ ధరించిన తమన్నా .. కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలను తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











