11th Hour కోసం భారీగా చార్జ్ చేసిన తమన్నా: సినిమా కంటే ఎక్కువ అందుకున్న మిల్కీ బ్యూటీ

చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. చిన్న వయసులోనే హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ.. 'హ్యాపీడేస్‌'తో మొదటి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లోని బడా హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. తద్వారా చాలా తక్కువ సమయంలోనే బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక, ఈ మధ్య కాలంలో సినిమాలను తగ్గించిందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా 'లెవెంత్ అవర్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. దీనికోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు తాజాగా లీకయ్యాయి.

'గుంటూరు టాకీస్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి వినూత్నమైన చిత్రాలతో తన సత్తాను నిరూపించుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. తమన్నా భాటియా ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'లెవెంత్ అవర్'. ప్రదీప్ ఉప్పలపాటి దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో మిల్కీ బ్యూటీ మరింత బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగేందుకు కృషి చేసే ఓ అమ్మాయి కథతో ఇది రూపొందినట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతోంది.

Tamannaah Charge Huge Remuneration for 11th Hour

తాజా సమాచారం ప్రకారం.. ఈ వెబ్ సిరీస్ కోసం తమన్నా భాటియా ఏకంగా రూ. 2 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకుందట. ఇది ఆమె సినిమాలకు తీసుకునే మొత్తం కంటే ఎక్కువ అన్న టాక్ వినిపిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెడుతోన్న ఈ బ్యూటీ.. భారీగా చార్జ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఇందులో తమన్నాతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, అరుణ్ అదిత్, వంశీ కృష్ణ, రోహిణి, శత్రు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇది ఏప్రిల్ 9న తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X