ఆ విషయం తెలిసినా ధైర్యంగా ఉండాల్సిందే.. సినిమాల్లో నటించడమంటే: తమన్నా

వెండితెరపై స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో స్టార్ స్టేటస్ కొట్టేసిన ఈ భామ ఇప్పటి హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. అందం, అందుకు తగిన అభినయం కనబర్చుతూ అవకాశాలు పట్టేస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు, ఐటెం సాంగ్స్ ఇలా ఒక్కటేమిటి.. అన్ని కేటగిరీల్లో తమన్నా స్పీడ్‌గా దూసుకెళ్లింది. అయితే గతంతో పోల్చితే ఈ మధ్యకాలంలో తమన్నా జోష్ కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. ప్రేక్షకులు సహా దర్శకనిర్మాతలు కొత్త టేస్ట్ కోరుకోవడం మూలంగా తమన్నా వెండితెర ప్రయాణానికి కాస్త బ్రేక్ పడింది.

ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన తమన్నా.. సినిమాల్లో నటించడం, వెండితెర ప్రయాణం ఎలా ఉంటుందనే దానిపై స్పందించింది. కెరీర్‌లో విజయాలతో పాటు అపజయాలను కూడా చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తమన్నా..''సినిమా అనేదే టీమ్‌ వర్క్‌. ఇందులో విజయం, అపజయం అనేది ఏ ఒక్కరి వల్లనో కలగదు. ఒకవేళ నా సినిమా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడిందంటే.. అందులో నా భాగం ఎంత ఉందనేది ఆలోచించాలి. కొనిసార్లు మనం ప్రయాణం చేస్తున్న నావ మునిగిపోతుందని తెలిసినా కూడా ధైర్యంగా ముందుకు సాగక తప్పదు. ఎలాగూ మునుగుతుందని తెలుసు కాబట్టి సగంలో ఉండగానే ఆ నావ నుంచి దిగడానికి ప్రయత్నించం కదా. సినిమాల్లో నటించడం కూడా అలాంటిదే. ఫలితం కొన్నిసార్లు కళ్ల ముందు కనిపించినా, నవ్వుతూ మన పని చేసుకుంటూ వెళ్ళాలి. కాలానుగుణంగా ఎన్నో మార్పులు రావడం సహజం'' అని పేర్కొంది తమన్నా.

Tamannaah Comments on Acting in movies

ఇక తమన్నా సినిమాలంటారా.. ఇటీవలే ఎఫ్ 2, అభినేత్రి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తమన్నా ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తున్న 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో నటిస్తోంది. మరోవైపు తమిళంలో వెంకటేశన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెట్రోమ్యాక్స్‌' అనే సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X