For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోనా.... అంతగా తెలియదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్.. దళపతి ఫ్యాన్స్ ఫైర్

  |

  తమిళంలో హీరోలను తమ ఆరాద్య దైవంగా భావిస్తుంటారు అక్కడి ప్రేక్షకులు. హీరోలు కూడా తమ అభిమానుల అంతే ప్రేమిస్తుంటారు. వారిని ప్రత్యేకంగా కలుస్తూ ఉంటారు. ఎక్కడైనా అభిమానులు చుట్టుముట్టినా.. వారి యోగక్షేమాలు అడిగి మరీ పంపిస్తుంటారు.

  ఇళయ దళపతి క్రేజ్..

  ఇళయ దళపతి క్రేజ్..

  ఒకప్పుడు ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటి వారు ఏలిన కొలీవుడ్‌ను రజినీ కాంత్, కమల్ హాసన్‌లు రాజ్యమేలుతున్నారు. అయితే వారి శకాన్ని మినహాయిస్తే..ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్, తలా అజిత్ హవా నడుస్తోంది. వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయంటే అభిమానుల మధ్య గొడవలు జరగాల్సిందే.

  పోటాపోటీ రికార్డులు..

  పోటాపోటీ రికార్డులు..

  అజిత్, విజయ్ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లను లెక్కగడుతూ.. సోషల్ మీడియా ఫ్యాన్స్ పెద్ద చర్చను నడుపుతారు. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ వాగ్వాదానికి దిగుతారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ హీరోలు.. తమ సినిమాలతో రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నారు. ఇద్దరూ మాస్ ఫాలోయింగ్‌ను ఎక్కువగా ఉన్నవారే కావడం విశేషం.

   అట్లీ దర్శకత్వంలో రాబోతోన్న బిగిల్...

  అట్లీ దర్శకత్వంలో రాబోతోన్న బిగిల్...

  ఫుల్‌బాల్ క్రీడా నేపథ్యంలో రాబోతోన్న ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. నేడు బిగిల్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో అది ట్రెండ్ అవుతోంది. దీన్ని బట్టే విజయ్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

  ఆయన గురించి అంతగా తెలీదు..

  ఆయన గురించి అంతగా తెలీదు..

  తమన్నా నటించిన పెట్రోమ్యాక్స్.. సినిమా విడుదల సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తున్న సందర్భంలో ఈ విషయం ప్రస్థావనకు వచ్చింది. విజయ్ గురించి చెప్పండంటూ అడిగిన ప్రశ్నకు తమన్నా చెప్పిన జవాబు.. విజయ్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

  అప్పుడు చాలా చిన్నదాన్ని...

  అప్పుడు చాలా చిన్నదాన్ని...

  సుర సినిమాలో ఆయనతో కలిసి నటించాను. అయితే ఆ సమయంలో ఆయనతో మాట్లాడింది చాలా తక్కువ. వచ్చామా పాటలో డ్యాన్స్ చేశామా.. వెళ్లామా అన్నట్లు ఉండేది.. ఆ సినిమాలో నా పాత్ర కూడా చాలా చిన్నది.. ఆయన గురించి తెలీకుండా నేను కామెంట్ చేయలేను.. నేనూ ఓ అభిమానిలానే ఆ సినిమాలో నటించా అంటూ బదులిచ్చింది.

  మరోసారి ఆయనతో..

  మరోసారి ఆయనతో..

  అయితే విజయ్‌తో మరో సినిమా చేయాలని చాలా సందర్భాల్లో తమన్నా చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఆ అవకాశం తనకు వస్తుందో లేదో చూడాలి. తమన్నా ప్రస్తుతం గోపిచంద్‌తో ఓ సినిమా, విశాల్ సరసన యాక్షన్ చిత్రంలో నటించనుంది. యాక్షన్ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. దీంతో పాటు మరో హిందీ చిత్రం కూడా చేతిలో ఉంది.

  తమన్నా నటనకు ప్రశంసలు..

  తమన్నా నటనకు ప్రశంసలు..

  నిన్న విడుదలైన పెట్రోమ్యాక్స్ సినిమాలో తమన్నా నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. నెగెటివ్ షేడ్‌లో కూడా తమన్నా బాగా నటించిందని.. పూర్తిగా విలన్ పాత్రలో నటిస్తే ఇంకా బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు. ఇక సైరా సినిమాలో లక్ష్మీ పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే.

  English summary
  Tamannah COmments On Vijay In Promotion OfPetromax Movie. She Said That when She worked with Vijay, She was very young. She also had a small part in Sura and had a small interaction with him. She hardly spoke to him then. She feel like She don't really know him much to comment on him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X