బ్రేకప్ తర్వాత సమంతను ఫాలో చేస్తున్న తమన్నా

కొన్నేళ్ల కితం వరకు తెలుగు సినిమా దగ్గర కొందరు స్టార్ హీరోయిన్స్ కనబరిచిన హవా అంతా ఇంతా కాదు తెలుగులో మాత్రమే కాకుండా తమిళ నాట కూడా వరుసగా మంచి ఆఫర్స్ అందుకొని దూసుకెళ్లిన స్టార్ బ్యూటీస్ లో దాదాపు కొందరి పరిస్థితి ఇపుడు ఒకేలా ఉందని చెప్పవచ్చు. కాగా ఆ హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా అలాగే సమంతలు కూడా ఒకరు.

అయితే సామ్ కంటే తమన్నా తెలుగులో కెరీర్ ముందు స్టార్ట్ చేసినప్పటికీ ఇపుడు ఈ ఇద్దరి హీరోయిన్స్ కూడా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో రాణించారు అలాగే హిందీ మార్కెట్ లోనే ఇపుడు ఎక్కువ బిజీగా ఉన్నారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కూడా ప్రొఫిషినల్ లైఫ్ పరంగా ఒకేలాంటి జీవితాన్ని చూసారు కానీ పర్శనల్ లైఫ్ పరంగా కూడా కొన్ని పాయింట్స్ కలిసేలా ఉన్నాయని చెప్పాలి.

tamannaah following samantha after breakup aspect

ఇద్దరి జీవితాల్లో కూడా ప్రేమలు ఉన్నాయి. అయితే సమంత పెళ్లి వరకు వెళ్లి విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. కానీ తమన్నా మాత్రం ప్రేమ, డేటింగ్ వరకు వెళ్లి బ్రేకప్ చెప్పుకుంది. ఇలా ఇద్దరు హీరోయిన్స్ కూడా తమ కెరీర్ లో ఒక చాప్టర్ కి స్వస్తి చెప్పేసారు. కాగా తమన్నా కంటే ముందు సామ్ కి బ్రేకప్ అయ్యింది. మరి ఈ బ్రేకప్ తర్వాత మాత్రం సమంతని తమన్నా ఫాలో ఐపోతున్నట్టుగా ఉందని చెప్పాలి.

కాగా సమంత ఇలా బ్రేకప్ విడాకులు వార్తల నుంచి తేరుకునే లోపే తన నుంచి ఒక ఊహించని హాట్ షోతో పుష్ప సినిమా నుంచి ఓ అంటావా అనే ఐటెం సాంగ్ ని దింపి అందరికీ షాకిచ్చింది. అసలు అంతకు ముందు వరకు సమంత వేరు తనకి విడాకులు అయ్యిన తర్వాత సమంత వేరు అనే రేంజ్ లో ఆ సాంగ్ కి రెచ్చిపోయింది. ఇక ఇదే తరహాలో తమన్నా శైలి కూడా ఉందని చెప్పి తీరాలి.

కాగా తమన్నా తన ఎక్స్ బాయ్ ఫ్రేం విజయ్ వెర్మతో విడిపోయిన తర్వాత ఒక ఐటెం సాంగ్ ని చేసింది. ఇపుడు ఈ సాంగ్ అందులో మెయిన్ గా తమన్నా అంద చందాల కోసమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తుంది. కాగా ఆ సినిమానే "రైడ్ 2". బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యిన రైడ్ కి సీక్వెల్ గా అజయ్ దేవగన్ నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ నే 'నాశా'.

కాగా ఈ సాంగ్ ని రిలీజ్ చేయడంతో ఇందులో తమన్నా అందచందాలు చూసి అంతా మెస్మరైజ్ అయిపోతున్నారు. తన లోని హాట్ షేడ్ చూపించడం ఒకెత్తు అయితే బ్రేకప్ తర్వాత తమన్నా బాగా డోస్ పెంచేసింది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీనితో తమన్నా మరోసారి టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారింది. దీనితో సమంతని ఈ విషయంలో తమన్నా ఫాలో అయిపోతుంది అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా పక్కన పెడితే తమన్నా నటించిన మరో సినిమా ఓదెల 2 తెలుగులో రిలీజ్ కి రాబోతుంది.

More from Filmibeat

Read more about: tamannaah samantha Raid 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X