సీటీమార్ డబ్బింగ్.. దుమ్ములేపుతోన్న తమన్నా
గోపీచంద్ తమన్నా జంటగా వస్తోన్న సీటీమార్ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. మొత్తానికి గౌతమ్ నందా సినిమా తరువాత మళ్లీ గోపీచంద్ సంపత్ నంది సినిమా వర్కవుట్ అయ్యేలానే ఉంది. ఇక తమన్నాతో ముచ్చటగా మూడోసారి చేస్తోన్నాడు సంపత్ నంది. ఇప్పటికే వీరి కాంబోలో రచ్చ, బెంగాల్ టైగర్ సూపర్ హిట్స్ అయ్యాయి.
ఇక సీటీమార్ సినిమాలోనూ తమన్నా దుమ్ములేపేందుకు రెడీ అయింది. కబడ్డీ కోచ్‌గా తమన్నా రెచ్చిపోయినటించినట్టు కనిపిస్తోంది. తమన్నాకు తెలుగు వచ్చు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కెరీర్ ప్రారంభంలో డబ్బింగ్ చెప్పుకోలేకపోయినా ఇప్పుడు తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది. అలా ఇప్పుడు సీటీమార్ డబ్బింగ్ పనుల్లో తమన్నా ఫుల్ బిజీగా ఉంటోంది.

అసలే తమన్నా వాయిస్ బేస్‌గా ఉంటుంది. అందులోనూ తమన్నా చేత తెలంగాణ యాసలో మాట్లాడిస్తున్నాడు సంపత్ నంది. ఇక తమన్నా కూడా డబ్బింగ్ థియేటర్లో దుమ్ములేచిపోయేలా డైలాగ్‌లు చెప్పేస్తోందట. డబ్బింగ్ ఇంజనీర్ కూడా తమన్నా మాటలు విని షాక్ అవుతున్నాడట. మొత్తానికి సంపత్ నంది షేర్ చేసిన వీడియోలో తమన్నా చెప్పిన డైలాగ్ హైలెట్ అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











