రెమ్యూనరేషన్ పెంచేసిన తమన్నా... ఇప్పుడు ఎంత వసూలు చేస్తోందా తెలుసా?
ఈ ఏడాది తమిళ తంబీల 100 కోట్ల మూవీ కలను నెరవేర్చిన హీరోయిన్ తమన్నా. సుందర్ సి దర్శకత్వంలో తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ హర్రర్ మూవీ అరుణ్మనై -4 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అయితే ఈ మూవీ హిట్ అయ్యాక తమన్నా తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్టుగా తెలుస్తోంది. మరి తమన్నా పారితోషికాన్ని ఎంత పెంచింది అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.
ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లోనూ నటిస్తూ ట్రెండింగ్ లో చెలరేగిపోతున్న తమన్నా మరోవైపు విజయ్ వర్మతో ప్రేమలో మునిగి తేలుతోంది. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తమన్నా తన పారితోషికాన్ని బాగా పెంచేసినట్టుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆమె అరుణ్మనై -4 మూవీలో హీరోయిన్ గా కనిపించింది ఈ మిల్కీ బ్యూటీ. ఇందులో రాశి కన్నా మరో హీరోయిన్గా నటించగా, సుందర్ సి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రను పోషించారు.
రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ తమిళంలో ఈ ఏడాది 100 కోట్లు కొల్లగొట్టిన ఫస్ట్ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరోవైపు తెలుగులో కూడా అరుణ్మనై -4 మూవీని బాక్ పేరుతో రిలీజ్ చేశారు.
అయితే తెలుగులో ఈ మూవీకి పెద్దగా ప్రేక్షకాదరణ దక్కలేదు. కోలీవుడ్ లో మాత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది ఈ మూవీ. మొత్తానికి తమన్నా అరుణ్మనై -4 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటే తన నెక్స్ట్ సినిమాలకు రెమ్యూనరేషన్ పెంచేసినట్టుగా తెలుస్తోంది.
ఇదివరకు ఈ మిల్కీ బ్యూటీ ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఒక కోటి రూపాయలు ఎక్స్ట్రా పెంచి మొత్తంగా 6 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్టు సమాచారం.

నెక్స్ట్ తమన్నా చేయబోయే సినిమాలకు 6 కోట్లు పారిసతోషికం డిమాండ్ చేస్తుందన్నమాట. అయితే ఈ సీనియర్ హీరోయిన్ కు క్రేజ్ రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది కాబట్టి మేకర్స్ కూడా ఆమె డిమాండ్స్ కు ఓకే చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం తమన్నా అభిమానులు ఆమె సినిమాల కంటే విజయ్ వర్మతో పెళ్లి గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ హైదరాబాదులో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా ఇటు తమన్నా గాని, అటు విజయ్ గాని తమ పెళ్లి గురించి మాట్లాడలేదు.


Click it and Unblock the Notifications











