గ్లామర్ డోస్ పెంచేసిన తమన్నా... వైరల్ అవుతున్న హాట్ పిక్!
ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఎఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన 'అభినేత్రి' 2016లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇపుడు దానికి సీక్వెల్‌గా 'అభినేత్రి 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైడెంట్ ఆర్ట్స్, అభిషేక్ పిక్చర్స్ పతాకాలపై అభిషేక్ నామా, ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నారు.
ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం విడుదల చేసిన తమన్నా హాట్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వానపాటలు, స్విమ్మింగ్ ఫూల్ సీన్లలో గతంలో గ్లామర్ డోసు పెంచి నటించిన తమన్నా ఇపుడు 'అభినేత్రి 2'లో సైతం తన అందాల ఆరబోతతో అభిమానులకు మంచి కిక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. మొదటి భాగంలో తమన్నా రూబీ అనే దెయ్యం పాత్రలో కనిపించింది. ఇపుడు రాబోతున్న సీక్వెల్‌లో ప్రభుదేవాను అలెక్స్ అనే దెయ్యం ఆవహిస్తుందని తెలుస్తోంది. ఈ సారి 2 దెయ్యాలతో చిత్రం ప్రేక్షకులను మరింత భయపెడుతుందట.
'అభినేత్రి 2' అన్ని కమర్షియల్ అంశాలతో పాటు పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసిన హారర్, కామెడీ ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతుందని, ప్రతి సీన్ ఉత్కంఠ భరితంగా సాగుతుందని నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నాతో పాటు నందితా శ్వేతా పెర్ఫార్మెన్స్‌లు హైలైట్ అయ్యే విధంగా ఉంటాయట. మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శామ్ సంగీతం అందిస్తుండగా, ఆయంక బోస్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











