For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బీచ్ లో బీర్ కొడుతూ తమన్నా.. ట్రాన్సపరెంట్ షర్ట్ లో అందాల ఆరబోత, వీడియో వైరల్!

  |

  ఎంతో కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకుంటూ స్పెషల్ పాపులారిటీ సంపాదించుకుంది మిల్కీ బ్యూటి తమన్నా. ఇప్పుడు సౌత్, నార్త్ సినిమాలతో దూసుకుపోతోంది. అయితే ఇటీవల కాలంలో తమన్నాను విపరీతంగా పలు పుకార్లు వేధించాయి. ఆ గాసిప్స్ ను తిప్పికొట్టిన తమన్నా భాటియా ఇటీవల తన ప్రియుడు, నటుడు విజయ్ వర్మతో ఘాటు ముద్దు సీన్లతో కనిపించి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఈ జంట గోవాలో ఎంజాయ్ చేసిన పిక్స్, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మరోసారి బీచ్ లో అలల మధ్య బీర్ తాగుతూ తమన్నా డ్యాన్స్ చేస్తూ మైమరిచిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

   అగ్ర హీరోలకు జోడిగా..

  అగ్ర హీరోలకు జోడిగా..

  తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని హీరోయిన్ మిల్కీ బ్యూటి తమన్నా. మంచువారి హీరో మనోజ్ నటించిన శ్రీ సినిమా ద్వారా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఎప్పటి నుంచో తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఎంతోమంది అగ్ర హీరోలతో ఆడిపాడిన ఈ బ్యూటి విశేషమైన క్రేజ్ సంపాదించుకుంది. హీరోయిన్ గానే కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో అలరిస్తూ అభిమానులకు ఎంటర్టైన్ మెంట్ ఇస్తోంది.

   50కిపైగా చిత్రాలలో..

  50కిపైగా చిత్రాలలో..

  మోస్ట్ గ్లామరస్ బ్యూటి తమన్నా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా హ్యాపీ డేస్ తో యువత హృదయాలను కొల్లగొట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లలో సుమారు 50కిపైగా చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ సినిమాల్లో కూడా ఆకట్టుకుంటూ తన సత్తా చాటుతోంది మిల్కీ బ్యూటి తమన్నా.

  తమన్నాకు పుకార్ల గోల..

  తమన్నాకు పుకార్ల గోల..

  ఇక ఈ 2022 సంవత్సరంలో తమన్నా సినీ కెరీర్ ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగింది. ఘని, F3, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం సినిమాలతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ 2023 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో సందడి చేయనుంది. అలాగే బోలే చూడియా, బాంద్రా వంటి హిందీ చిత్రాలతో ఆకట్టుకోనుంది. ఇదిలా ఉంటే ఇటీవల తమన్నాకు పుకార్ల గోల ఎక్కువైంది.

   లిప్ కిస్ ఇచ్చి దొరికిపోయి..

  లిప్ కిస్ ఇచ్చి దొరికిపోయి..

  ఈ 2022లోనే తమన్నా సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ అబ్బాయితో డేటింగ్ చేస్తోందని వార్తలు రాగా ఓ ఇంటర్వ్యూలో తీవ్రంగా ఖండించింది. అలాగే ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరగనుందని కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు F 3 సినిమాలో మేల్ గెటప్ ను చూపించి అతడే తనకు కాబోయే భర్త అని చెప్పి స్ట్రాంగ్ గా, వెటకారంగా కౌంటర్ ఇచ్చింది. అయితే ఇటీవల హైదరాబాదీ నటుడు విజయ్ వర్మకు లిప్ లాక్ ఇచ్చి గట్టిగా దొరికిపోయింది మిల్కీ బ్యూటి తమన్నా.

   రెండు మూడు రోజులు..

  రెండు మూడు రోజులు..

  న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో సెలబ్రేషన్స్ జరుపుకుంది గ్లామరస్ బ్యూటి తమన్నా. ఈ వేడుకలను తమన్నా, విజయ్ వర్మ గోవాలో ఘనంగా జరుపుకొన్నారు. తన స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్ లో తమన్నా, విజయ్ వర్మ లిప్‌లాక్ చేసుకొంటూ కనిపించారు. అక్కడే రెండు, మూడు రోజులు అక్కడే ఎంజాయ్ చేశారు. వెకేషన్ పూర్తి చేసుకుని మంగళవారం రాత్రి ముంబైకి చేరుకున్న ఈ జంట వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి.

  బీర్ తాగుతూ..

  బీర్ తాగుతూ..

  అయితే ఇప్పుడు గోవాలో తమన్నా ఎంజాయ్ చేసిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తమన్నా గోవా బీచ్ లో బీర్ తాగుతూ డ్యాన్స్ చేస్తూ మైమరిచిపోతూ దర్శనమిచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో వైట్ ట్రాన్సపరెంట్ షర్ట్ వేసుకున్న తమన్నా ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. అలాగే బ్లూ షార్ట్ జీన్స్ ధరించగా తమన్నా థైస్ అందాలు బీచ్ లో హాట్ గా ఎక్స్ పోజ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

  English summary
  Milky Beauty Tamannaah Bhatia Enjoying New Year Celebration At Goa Beach With Drinking And Dancing Video Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X