For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tamannaah వ‌ల్ల కోట్ల న‌ష్టం.. హ్యాండ్ ఇవ్వడమే కాక అలా అడిగింది.. షాకయ్యామంటూ మాస్ట‌ర్ చెఫ్ నిర్వాహ‌కుల ఆగ్రహం

  |

  ఈ మధ్య కాలంలో మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్లు సైతం టీవీ కార్యక్రమాలు హోస్ట్ చేయడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు. సినిమాలకు తలదన్నే రీతిలో రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉండడంతో ఎలాంటి టీవీ షోలు అవకాశం వచ్చినా వదలడం లేదు. అలాగే తమన్నా సైతం జెమినీ టీవీ కోసం మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రాం చేయగా ఆ షో నిర్వాహకులు మీద ఆమె కోర్టుకు వెళ్లి షాక్ ఇచ్చింది. తాజాగా ఈ వ్యవహారం మీద షో నిర్వాహకులు స్పందించారు. వివరాల్లోకి వెళితే.

  వ్యూయర్ షిప్ లేదు

  వ్యూయర్ షిప్ లేదు

  ఇటీవల వెబ్ సిరీస్ అలాగే డిజిటల్ ఎంట్రీకి హీరో హీరోయిన్లు ఏ మాత్రం వెనుకాడడం లేదు. అలాగే షోలు నిర్వహణ విషయంలో కూడా ఆసక్తికరంగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే జెమినీ టీవీ కోసం తెలుగులో తమన్నా మాస్టర్ చెఫ్ అనే ఒక ప్రోగ్రాం చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు షో లాంచ్ చేసినప్పుడే ఈ షో కూడా లంచ్ చేశారు. వంటలకు సంబంధించిన ప్రోగ్రాం కావడంతో ఈ ప్రోగ్రామ్ కావడంతో పెద్దగా వ్యూయర్ షిప్ అయితే రావడం లేదు అది వేరే విషయం.

  అనసూయ ఎంట్రీతో

  అనసూయ ఎంట్రీతో

  అయితే అనూహ్యంగా ఈ షో నుంచి ఆమెను తప్పించి తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయను తెర మీదకు తీసుకువచ్చారు నిర్వాహకులు. అయితే తమన్నా తప్పుకోవడంతో అనసూయకు ఈ అవకాశం దక్కిందని అందరూ భావించారు కానీ తమన్నా షూటింగులకు రాకపోవడంతోనే ఆమెను తప్పించారనే విషయం తాజాగా తెరమీదకు వచ్చింది. తనను తొలగించి అనసూయను పెట్టు కోవడంతో పాటు తనకు రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదని చెబుతూ ప్రొడక్షన్ హౌస్ కి తమన్నా లీగల్ నోటీసులు పంపించింది.

  అన్నీ వదులుకుంటే ఇలా చేస్తారా?

  అన్నీ వదులుకుంటే ఇలా చేస్తారా?

  ఈ విషయం మీద తమన్నా తరఫున న్యాయవాది మాట్లాడుతూ మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం చేసేందుకుగాను తమన్నా పలు ఇతర కమిట్మెంట్ లను కూడా వదులుకుందని చెప్పుకొచ్చారు. ఈ షో మొదటి సీజన్ పూర్తి చేయడం కోసం చాలా ముఖ్యమైన పనులను కూడా ఆమె పక్కన పెట్టాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు. షో కోసం అంత చేస్తుంటే నిర్వాహకులు మాత్రం చాలా అన్ ప్రొఫెషనల్ గా వ్యవహరించారు అని తన క్లయింట్ తో ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా కమ్యూనికేషన్ నిలిపివేశారని కూడా న్యాయవాది పేర్కొన్నారు. అలా చేయడం వల్ల లీగల్ నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.

  నోరు విప్పిన మాస్టర్ చెఫ్

  నోరు విప్పిన మాస్టర్ చెఫ్

  ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద మాస్టర్ చెఫ్ షో నిర్వాహకులు స్పందించారు. తాము బెంగళూరు సివిల్ కోర్టుకు వెళుతున్నామని తమన్నా తమతో సైన్ చేసిన అగ్రిమెంట్ ప్రకారమే కోర్టుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. వారు జారీ చేసిన ప్రకటనలో తమన్నా మాట్లాడిన మాటలు అన్నీ నిజాలు కావని, మాకు అంటే ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ-తమన్నా మధ్య ఉన్న కాంట్రాక్టు ప్రకారం 24వ తేదీ జూన్ నుండి సెప్టెంబర్ నెలాఖరు లోపు 18 రోజులు షూటింగ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

  మా మధ్య ఒప్పందం ఇది

  మా మధ్య ఒప్పందం ఇది

  అలా 18 రోజుల షూటింగ్ జరిపినందుకుగాను ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ తమన్నాకు రెండు కోట్లు కట్టేందుకు అంగీకరించిందని ఈ మేరకు ఉన్న కాంట్రాక్టు మీద రెండు పార్టీలు సంతకాలు చేశారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు నిర్వాహకులు ఏమంటున్నారంటే మేము ఆమె 16 రోజుల షూటింగ్ లో పాల్గొంది కాబట్టి ఆ డబ్బులు క్లియర్ చేశాము అంటున్నారు. 16 రోజులకు గాను ఆమెకు 1.56 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. కానీ ఆమె లేట్ చేయడం వల్ల షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెబుతోంది. లెక్క ప్రకారం ఈ షూటింగ్ అంతా సెప్టెంబర్ లోపు పూర్తి కావాలి కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి చేసే పరిస్థితి లేదని చెబుతోంది.

   ఐదు కోట్ల రూపాయలు నష్టపోయాము

  ఐదు కోట్ల రూపాయలు నష్టపోయాము

  తమన్నా మంచి రెస్పాన్స్ లేకపోవడం వల్ల తాము ఐదు కోట్ల రూపాయల దాకా నష్టపోయామని ఎందుకంటే తమన్నా ఒక్కరూ రాకపోయినా తాము మిగతా 300 పైగా ఉన్న ఇతర క్రూ మొత్తాన్ని పిలిపించుకోవాల్సి ఉంటుందని ఈ కారణంగా మేము ఐదు కోట్ల రూపాయలు నష్టపోయామని చెబుతున్నారు. అయితే తమన్నాతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం చివరి రెండు రోజులు షూటింగ్ కూడా పూర్తయి ఉంటె మొత్తం అమౌంట్ కూడా రిలీజ్ చేసే వాళ్ళని కానీ ఆమె షూటింగ్ పూర్తి చేయకపోవడంతో అగ్రిమెంట్ ప్రకారం ఆ డబ్బులు ఇవ్వలేదని చెబుతున్నారు.

  Nithiin Vinayaka Chavithi Special Interview | Maestro Movie
  అడ్వాన్స్ డబ్బులు కూడా

  అడ్వాన్స్ డబ్బులు కూడా

  అంతేకాక ఆమె మిగిలిన ఎపిసోడ్స్ పూర్తి చేయకుండా రెండవ సీజన్ కి సంబంధించిన అడ్వాన్స్ డబ్బులు కూడా అడుగుతోంది అని, అసలు మిగిలిపోయిన 2 ఎపిసోడ్స్ ఎవరితో పూర్తి చేయాలో తెలియక మేము తలలు పట్టుకుంటే ఆమె రెండవ సీజన్ డబ్బులు కూడా డిమాండ్ చేయడం మాకు షాకింగ్ అనినిపించిందని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే ఏమైనా తేడాలు ఉంటే మాట్లాడుకోవాలి కానీ తమన్నా నేరుగా మీడియాకి వెళ్లడం కూడా తమకు షాకింగ్ గా అనిపించిందని అందుకే ఒక రెస్పాన్సిబుల్ కంపెనీ గా మేము దీనిని లీగల్ గానే ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నామని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మరి దీని మీద తమన్నా ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.

  English summary
  Tamannaah not lived up to her commitment due to other work alleges MasterChef Telugu makers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X