twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశాల్ కొత్త చిత్రం.. నెగిటివ్ రోల్‌కు ఒకే చెప్పిన తమన్నా!

    |

    మిల్కీ బ్యూటీ తమన్నాకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. హీరోయిన్ గా కొనసాగుతూనే అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తోంది తమన్నా. కాగా ప్రస్తుతం తమన్నా విభిన్నమైన పాత్రలపై ద్రుష్టి పెట్టింది. తాజగా తమన్నా ఓ నెగిటివ్ రోల్ లో నటించడానికి ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో విశాల్ కొత్త చిత్రం సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనుంది. థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కనుందట.

    తమన్నా పాత్రని దర్శకుడు నెగిటివ్ షేడ్స్ తో రూపొందించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. గతంలో తమన్నా, విశాల్ జంటగా కత్తి సందై చిత్రంలో నటించారు. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటివరకు గ్లామర్ హీరోయిన్ గా మెప్పించిన తమన్నా నెగిటివ్ రోల్ లో ఎలా నటిస్తుందో చూడాలి.

    Tamannaah to play negative role in Vishal movie, Sundar C is the director

    మరోవైపు తమన్నా క్వీన్ రీమేక్ చిత్రం డట్ ఈజ్ మహాలక్ష్మిలో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటిస్తోంది. విశాల్, తమన్నా నటించే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని లాంచ్ చేసేందుకు సన్నకాలు చేస్తున్నారు. హైదరాబాద్ యువతి అనీషాతో విశాల్ నిశ్చితార్థం ఇటీవల్ జరిగిన సంగతి తెలిసిందే.

    English summary
    Tamannaah to play negative role in Vishal movie, Sundar C is the director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X