ఇది మంచి అవకాశం.. ఈ టైమ్ అంతా దానికే వేడేస్తా.. భలే తమన్నాలే!
ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతోంది. ఈ మహమ్మారి వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అన్నిదేశాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ జనాన్ని సామాజిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశాయి. కరోనా కట్టడికి ఏకైక, ఉత్తమమైన మార్గం సామాజిక దూరమే అంటున్నారు వైద్య నిపుణులు.
ఈ పరిస్థితుల్లో మరో 21 రోజులు (ఏప్రిల్ 15 దాకా) దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు ప్రధాని మోడీ. దేశ ప్రజలంతా కరోనా కట్టడిలో భాగమవుతూ ఇంటికే పరిమితం కావాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సాధారణ ప్రజలు మొదలుకొని సినీ సెలబ్రిటీల వరకు అందరూ ఇంట్లోనే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై తాజాగా మిల్కీ బ్యూటీ రియాక్ట్ అయింది.

కరోనా కారణంగా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేస్తుకుంటానని అంటోంది తమన్నా. ఇన్ని రోజులు చేయాలనుకొని వాయిదా వేస్తూ వచ్చిన పనులపై దృష్టి పెడుతూ ఈ 21 రోజుల్లో అవన్నీ పూర్తిచేసుకుంటానని చెబుతోంది. అంతేకాదు ''ఏదైనా అలవాటు కావాలన్నా, దాని నుండి దూరం కావాలన్నా 21 రోజులు అవసరమని అంటారు కదా. ఓ మంచి పని కోసం ఈ 21 రోజులు ఎందుకు వాడకూడదు?'' అని అంటోంది తమన్నా. ఆమె తీరు చూసి భలే తమన్నాలే! అంటున్నారు ప్రేక్షకులు.


Click it and Unblock the Notifications











