Tamannaah: వ్యాపారవేత్తతో తమన్నా పెళ్లి?.. కాబోయే భర్తను చూపించిన మిల్కీ బ్యూటి!

మిల్కీ బ్యూటి తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మంచు మనోజ్ శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్ చిత్రంతో కుర్రాళ్ల గుండెల్లో మధుగా ముద్ర వేసుకుంది. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటూ సుమారు 17 ఏళ్లలో 50కి పైగా చిత్రాల్లో అలరించింది.

హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నర్తించి అట్రాక్ట్ చేసింది ఈ బ్యూటి. ఇటీవలే తెలుగులో F3, హిందీలో బబ్లీ బౌన్సర్ గా వచ్చిన తమన్నా సందడి చేసింది. అయితే ఈ మధ్య తమన్నా పెళ్లి వార్తలపై పుకార్లు తెగ షికార్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తనకు కాబోయే భర్తను చూపించింది ఈ మిల్కీ బ్యూటి.

తెలుగుతోపాటు ఇతర భాషల్లో..

తెలుగుతోపాటు ఇతర భాషల్లో..

మిల్కీ బ్యూటి తమన్నా హ్యాపీ డేస్ సినిమాతో యూత్ హృదయాలను కొల్లగొట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లలో సుమారు 50కిపైగా చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ సినిమాల్లో కూడా అలరించి తన సత్తా చాటుకుంది. ఇటీవల వెంకటేష్ సరసన F3 సినిమాలో నటించి ఫన్ అందించింది. అలాగే నేరుగా ఓటీటీలో విడుదలైన బబ్లీ బౌన్సర్ సినిమాతో ఇటు తెలుగు అటు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 2005లో శ్రీ సినిమాతో..

2005లో శ్రీ సినిమాతో..

ఇప్పుడున్న గ్లామరస్ బ్యూటీలలో ఎక్కువ కాలం నిలదొక్కుకున్న అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్స్ లలో తమన్నా భాటియా ఒకరు. 2005లో తెలుగులో డెబ్యూ చేసిన ఈ బ్యూటి తన స్టార్ ఇమేజ్ తోనే ఇప్పటి వరకు అవకాశాలు అందుకుంటుంది. 2005లో మంచు మనోజ్ నటించిన శ్రీ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తమన్నా ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంది.

హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా..

హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా..

మిల్కీ బ్యూటి తమన్నా మొదట్లో మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలలో సెలెక్ట్ చేసుకుని తన స్టార్ హోదాను పెంచుకుంది. ఇక తర్వాత మెల్లిగా మీడియం బడ్జెట్ సినిమాలు ఆ తరువాత బిగ్ బడ్జెట్ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. తమన్నా తన సినిమా ప్రయాణంలో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండానే కొనసాగింది. ఒక సినిమా డిజాస్టర్ అయితే ఆ తర్వాతి వెంటనే మరొక సినిమాతో ఫామ్ లోకి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంది ఈ బ్యూటి.

 స్పెషల్ సాంగ్స్ తో కూడా..

స్పెషల్ సాంగ్స్ తో కూడా..

హ్యాపీ డేస్, 100% లవ్, రచ్చ, బాహుబలి, F 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. మరొకవైపు స్పెషల్ సాంగ్ తో కూడా గుర్తింపు అందుకుంది. ఇక తమన్నా భాటియా నటించిన కొత్త చిత్రం బబ్లి బౌన్సర్ సెప్టెంబర్ 25వ నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన తమన్నా బబ్లీ బౌన్సర్ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇండస్ట్రీకి చెందిన అబ్బాయితో..

ఇండస్ట్రీకి చెందిన అబ్బాయితో..

మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బబ్లీ బౌన్సర్ సినిమాలో తమన్నా ఒక లేడీ బౌన్సర్ గా కనిపించి ఆకట్టుకుంది. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తమన్నాకు ఇటీవల కాలంలో రూమర్స్ బెడద అంటుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ అబ్బాయితో తమన్నా పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి. ఇదే ప్రశ్నను ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. వాటిని ఖండించింది తమన్నా.

మంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో..

మంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో..

అయితే తాజాగా తమన్నా మంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహానికి సిద్ధమైందన్న రూమర్లు తెగ చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని వార్తలు షికార్లు చేశాయి. దీంతో ఈ వార్తలపై తమన్నా స్పందించి.. తనకు కాబోయే భర్తను చూపించింది. అయితే ఆ అబ్బాయి ఎవరో కాదు.. తమన్నానే. ఇటీవల F3 సినిమాలో తమన్నా అబ్బాయిగా నటించిన విషయం తెలిసిందే.

అబ్బాయిగా కనిపించే పాత్రలో..

అబ్బాయిగా కనిపించే పాత్రలో..

F3 సినిమాలో మురళి శర్మ వారసుడిని అంటూ అబ్బాయిగా కనిపించే పాత్రలో నటించింది తమన్నా. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన తమన్నా "ఇదిగో నా బిజినెస్ మ్యాన్ భర్తను పరిచయం చేస్తున్నా" అని రాసుకొచ్చింది. అలాగే ఈ ఇన్ స్టా గ్రామ్ స్టోరీకి "మ్యారేజ్ రూమర్స్" అని హ్యాష్ ట్యాగ్ ఇవ్వడంతో పాటు "ప్రతి ఒక్కరూ నా జీవితాన్ని చెప్పేస్తున్నారు" అని తెలిపింది ఈ మిల్కీ బ్యూటి.

తమన్నా స్ట్రాంగ్ కౌంటర్..

తమన్నాపై వస్తున్న రూమర్స్ పై ఫన్నీగా కాదని చెబుతూనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మిల్కీ బ్యూటి తమన్నా. ఈ బ్యూటి రియాక్షన్ తో ఆమె వస్తున్న పెళ్లి వార్తలు, అధికారిక ప్రకటన అన్ని పుకార్లే అని చాలా స్ట్రాంగ్ అర్థం అవుతోంది. ఇక ఇప్పుడైన ఇలాంటి రూమర్స్ రాకుండా ఉంటాయో వేచి చూడాలి. కాగా మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేశ్ కాంబినేషన్ లో వస్తున్న భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X