‘ఆహా’ అనిపించేలా తమన్నా టాక్ షో.. అబ్బా అనిపించేలా రెమ్యునరేషన్

మిల్కీబ్యూటీగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న తమన్నా భాటియా సరికొత్త దారిలో నడవబోతోంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే యాంకర్ గా కూడా క్లిక్కవ్వాలని డిసైడ్ అయ్యింది. త్వరలోనే ఒక టాక్ షో ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులను సరికొత్తగా ఎట్రాక్ట్ చేయనుంది. ఇక ఆమె ఆ టాక్ షో కోసం రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకొనున్నట్లు తెలుస్తోంది.

 ఆహా యాప్..

ఆహా యాప్..

తమన్నా టాక్ షో ప్రసారం కాబోయేది ఆహా యాప్ లోనే. ఇండియన్ ఓటీటీ బిజినెస్ లో విదేశి కంపెనీల జోరు ఎక్కువవుతోంది. అలాగే పరభాషా సంస్థలు కూడా టాలీవుడ్ పై కన్నేశాయి. ఇక తెలుగు యాప్స్ లేవని అనుకుంటున్నా తరుణంలో ఆహా యాప్ ని వదిలారు. నిర్మాత అల్లు అరవింద్ ఆహా యాప్ ని డెవలప్ చేసే బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముందుగా తమన్నా..

ముందుగా తమన్నా..

ఇకపోతే ఈ టాక్ షో ద్వారానే యాప్ కి సబ్‌స్క్రైబర్లను భారీ స్థాయిలో పెంచాలని అల్లు అరవింద్ స్టార్ యాక్టర్స్ ని రెడీ చేస్తున్నాడు. ముందుగా తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ కి భారీ రెమ్యునరేషన్ ఇస్తూ టాక్ షోని నడిపించే బాధ్యతను అప్పగించారు. తమన్నా హోస్ట్ గా స్టార్స్ ని ఇంటర్వ్యూ చెయడంతో పాటు స్పెషల్ టాస్క్ లు ఇస్తుందట.

రామ్ చరణ్.. అల్లు అర్జున్ లతో స్టార్ట్..

రామ్ చరణ్.. అల్లు అర్జున్ లతో స్టార్ట్..

ఇక మొదటి ఎపిసోడ్ లో స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు గాని షోకి తమన్నా మాత్రం దాదాపు ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే షోకి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.

రెమ్యునరేషన్ ఎంతంటే..

రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇక ఈ టాక్ షోకు తమన్నా అదుకునే పేమెంట్స్ పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఓ విదంగా ఆమె ఒక సినిమాకు అందుకోబోయే రెమ్యునరేషన్ కంటే ఇది చాలా ఎక్కువని తెలుస్తోంది. ఒక ఎపిసోడ్ కి తమన్నా 8 లక్షల వరకు అందుకోనుందట. నెలరోజులు కంటిన్యూగా వర్క్ చేస్తే 2కోట్లకు పైగా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.

Recommended Video

Vishal's Action Movie Public Talk
 టాక్ షో.. సేఫ్ జోన్..

టాక్ షో.. సేఫ్ జోన్..

ఇక ఆమె సినిమాల కోసం ప్రస్తుతం అందుకునే రెమ్యునరేషన్ 1కోటి మాత్రమే. కొన్నిసార్లు 30రోజుల కంటే ఎక్కువ రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే.. ఈ టాక్ షో ద్వారా ఆమెకు సాలీడ్ రెమ్యునరేషన్ అందే ఛాన్స్ ఉన్నట్లు అర్ధమవుతోంది. పైగా ఈ కరోనా సమయంలో షూటింగ్స్ తో రిస్క్ చేయడం కన్నా.. ఇలాంటి టాక్ షోలు చేసుకుంటే సేఫ్ కాబట్టి తమన్నా కూడా ఈ వర్క్ తో బిజీ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X