తమన్నా ‘నో కిస్సింగ్’ నిబంధన... ఆ ఒక్క హీరోకు మాత్రం వర్తించదట!

Recommended Video

Tamannaah Ready To Crucify Her No-Kissing Clause For Hrithik Roshan | Filmibeat Telugu

హీరోయిన్ తమన్నా ఇప్పటి వరకు తెరపై సెక్సీగా గ్లామర్ ఆరబోయడం చూశాం కానీ.. తన పెదవులను ముద్దాడే అవకాశం ఏ హీరోకూ ఇవ్వలేదు. ముందు నుంచీ మిల్కీ బ్యూటీ ముద్దు సీన్లకు దూరంగా ఉంటూనే వస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ట్రెండ్ మారినా.. ముద్దు సీన్లు అనేవి సర్వసాధారణం అయినా.. ఆమె మాత్రం తను పెట్టుకున్న కట్టుబాటు దాటి ముందుకు రావడం లేదు.

అంతే కాదు.. తమన్నా ఏ సినిమాకు సైన్ చేసినా తన అగ్రిమెంటులో 'నో కిస్సింగ్' నిబంధన తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంది. తన నిబంధనను ఎప్పటికీ మార్చుకోను అంటున్నతమన్నా ఒక హీరో విషయంలో మాత్రం దాన్నిసడలిస్తానంటోంది.

అతడితో అయితే ఓకే...

అతడితో అయితే ఓకే...

నేను ముందు నుంచీ ముద్దు సీన్లకు దూరంగానే ఉంటున్నాను. అలాంటి సీన్లు చేయను అనే నిబంధన నా కాంట్రాక్టులో తప్పకుండా ఉంటుంది. అయితే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ విషయంలో మాత్రం ఈ నిబంధన సడలిస్తాను అంటోంది తమన్నా.

అతడికి మాత్రమే ఛాన్స్ ఎందుకంటే...

అతడికి మాత్రమే ఛాన్స్ ఎందుకంటే...

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. హృతిక్ రోషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు పెద్ద అభిమానిని. ఒక వేళ అతడితో సినిమా చేసే అవకాశం వస్తే, అందులో ముద్దు సీన్లు చేయాల్సి వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు.

నా ఫ్రెండ్స్ అడిగినా ఇదే చెప్పేదాన్ని..

నా ఫ్రెండ్స్ అడిగినా ఇదే చెప్పేదాన్ని..

సరదాగా నా స్నేహితులను కలిసినపుడు మా మధ్య ముద్దు సీన్ల గురించిన ప్రస్తావన వచ్చేది. హృతిక్ రోషన్ అయితే తప్పకుండా చేస్తాను అని వారితో జోక్ చేసేదాన్ని. నిజంగా అలాంటి అవకాశమే వస్తే వదులుకోనేమో అని తమన్నా వ్యాఖ్యానించారు.

స్టుపిడ్‌లా ప్రవర్తించాను

స్టుపిడ్‌లా ప్రవర్తించాను

‘‘ఇటీవల ఒకసారి హృతిక్ రోషన్‌‌ను కలిసే అవకాశం వచ్చింది. ఆయన్ను కలవగానే ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. స్టుపిడ్‌గా ప్రవర్తించాను. సరిగా మాట్లాడలేక పోయాను. నా ప్రవర్తన చూసి ఆయనే ఫోటో కావాలా? అడిగారు. 16 ఏళ్ల వయసులో తొలిసారి ఆయన్ను కలిసినపుడు ఎలా ఫీలయ్యానో...ఈ సారి అలాంటి ఫ్యాన్ మూమెంట్ ఫీలయ్యాను'' అని తమన్నా గుర్తు చేసుకుంది.

తమన్నా కోరిక తీరేనా?

తమన్నా కోరిక తీరేనా?

హృతిక్ రోషన్‌కు పెద్ద అభిమాని అయిన తమన్నా.. అతడితో నటించే అవకాశం దక్కించుకోవాలని, కనీసం ఆ విధంగా అయినా తమన్నా ముద్దు సీన్ చూసే చాన్స్ వస్తుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె దట్ ఈజ్ మహాలక్ష్మి, దేవి 2(తమిళం), సైరా నరసింహారెడ్డి, కామోషి(హిందీ) చిత్రాల్లో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X