ఆ విషయంలో హద్దులు పెట్టుకోలేదు కానీ.. అది మాత్రం కుదరదన్న మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా.. అంటే అందరికీ గుర్తొచ్చే గ్లామర్ డాల్‌గానే. ఇండస్ట్రీలోకి వచ్చిన దశాబ్దం గడుస్తున్నా.. చెక్కుచెదరని అందంతో కుర్రకారును కవ్విస్తోంది. లేటేస్ట్‌గా వస్తోన్న హీరోయిన్లకు పోటీగా.. దూసుకుపోతున్న తమన్నా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది.

మొదట్నుంచీ స్కిన్ షో..
మొదట్నుంచీ స్కిన్ షో చేస్తూ వస్తోన్న తమన్నా.. హద్దులు దాటి మాత్రం ఏనాడు స్క్రీన్‌పై హల్ చల్ చేయలేదు. సినిమా కథను బట్టి, సీన్‌కు ఉన్న ప్రాముఖ్యతను బట్టి తన అందాలను ప్రదర్శిస్తూ వచ్చేది. తెలుగులో వచ్చేసరికి తమన్నా.. బద్రీనాద్ సినిమాలో రెచ్చిపోయి చేసేసింది. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన అభినేత్రి సిరీస్‌లో హోమ్లీగా కనిపిస్తూనే హాట్ హాట్ స్టెప్పులతో దుమ్ములేపింది.

బాహుబలి ఆ ఒక్క షాట్..
బాహుబలి మొదటి పార్ట్‌లో తమన్నా చేసిన ఒక్క పాట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమాలో కాస్త గ్లామర్ పాళ్లను తమన్నానే నింపేసింది. ఆ పాటలో ఒక్క షాట్ హాఫ్ న్యూడ్‌గా చూపించారు. ఈ సీన్‌పైనా విమర్శలు వచ్చాయనుకోండి అది వేరే విషయం. అయితే అవసరం మేరకు మాత్రమే తమన్నా స్కిన్ షో చేస్తూ వస్తోంది.. కాన్నీ ప్రతీ సినిమాలో అనవసరంగా చేయలేదు.
Recommended Video

కామన్ అయిన లిప్ లాక్ సీన్స్..
హాలీవుడ్, బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన కల్చర్ దక్షిణాదిన కూడా పాకింది. సినిమాలో ముద్దు సన్నివేశాలు, లిప్ లాక్, మితిమీరిన శృంగార సన్నివేశాలనేవీ కామన్ అయిపోయాయి. అవి లేకుంటే అసలు అది సినిమానేనా అనే పరిస్థితి వచ్చేసింది.

ఆ సీన్స్‌కు మాత్రం నో..
గ్లామర్ షో చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ముద్దు సన్నివేశాలు, లిప్ లాక్ సీన్స్ మాత్రం చేయలేను అంటూ తమన్నా కుండబద్దలు కొట్టేసింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే ఈ నిబందనను పెట్టుకున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి సీన్స్‌లో నటించను అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తమన్నా తమిళంలో నటించిన పెట్రోమ్యాక్స్ సినిమా విడుదలైంది. విశాల్ సరసన నటించిన యాక్షన్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేసింది. ఇటీవలె సైరా సినిమాలో తమన్నా పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











