ఇండస్ట్రీలో పెద్దలుగా చలామణి అవుతున్న వారు ఒకప్పుడు ఎలా వచ్చారు.. తమన్నా షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నెపొటీజమ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలీవుడ్ కి చెందిన చాలా మంది సెలబ్రెటీస్ పై విమర్శలు ఒక రేంజ్ లో వచ్చాయి. అయితే నెపొటీజమ్ పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తమన్నా కూడా తనదైన శైలిలో కాస్త ఘాటుగానే స్పందించింది.

చాలా రోజుల తరువాత..
కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ కి కాస్త దూరంగానే ఉన్న మిల్కిబ్యూటీ మీడియాకు కూడా చాలా దూరంగానే ఉంది. ఇక చాలా రోజుల తరువాత ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి అనేక విషయాలను తెలిపింది. అదే విధంగా సుశాంత్ సింగ్ ఘటనపై స్పందించిన తమన్నా టాలీవుడ్ లో నెపొటీజమ్ వస్తున్న వ్యాఖ్యలపై కూడా వివరణ ఇచ్చారు.

తమన్నా మాట్లాడుతూ..
మా ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్లుగా కొనసాగుతున్నారు. ఒకవేళ నేను ఆ వృత్తిని ఎంచుకొని ఉంటే తప్పకుండా వాళ్ళు నన్ను ఎదో ఒక విధంగా అయితే గైడ్ చేసేవారు. కానీ నాకు నచ్చిన సినిమా ఇండస్ట్రీలోనే నేను సొంతంగా ఎదిగాను. ఓకవేళ నా పిల్లలు సినిమాల్లోకి రావాలని అనుకుంటే తప్పకుండా వారికి నేను గైడ్ చేయాల్సి ఉంటుంది.

వారు ఎలా వచ్చారు..
నెపోటీజమ్ అనేది ఏ రంగంలో అయినా ఉంటుంది. కేవలం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే ఉండదు. నేను అయితే ఎలాంటి సపోర్ట్ లేకుండా సొంతంగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దలుగా చలామణి అవుతున్న వారు ఎలా వచ్చారు? వారు కూడా ఒకప్పుడు ఒంటరిగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కదా.. ఆ తరువాత వారి వారసులు రావడం అనేది చాలా కామన్.
Recommended Video

అన్ని రంగాల్లో ఉన్నదే కదా..
ఒక మార్గంలో నిలదొక్కుకున్న తరువాత వాళ్ళ సొంత కుటుంబ సబ్యులకు సపోర్ట్ చేయడం అనేది సర్వ సాధారణమైన విషయం. ఇది అన్ని రంగాల్లో ఉన్నదే కదా.. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తెలుగు తమిళ్ లో నాకు ఎవరు తెలియదు. పరిచయాలు లేవు. కేవలం నా కష్టం, ప్రతిభ వల్లే అవకాశాలు వచ్చాయి. రాజకీయాలు, బంధుప్రీతి అనేది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే లేదు. ఇక అలాంటి వాటి వల్ల విజయాలు, అపజయాలు రావని కోరుకుంటున్నట్లుగా ఏది జరగదని తమన్నా తెలియజేశారు.


Click it and Unblock the Notifications











