మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన తమన్నా.. ఏకంగా పాన్ ఇండియా హీరోతో రొమాన్స్!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దాటినా కూడా ఇంకా స్టార్ హోదాను అలానే కొనసాగిస్తోంది. ఎలాంటి సినిమా వచ్చినా కూడా తన పాత్రతో సినిమాకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతోంది. కేవలం గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా డిమాండ్ పెంచుకుంటున్న ఈ బ్యూటీ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. ఇక ఇటీవల మరొక గోల్డెన్ ఆఫర్ అందుకుంటున్నట్లు సమాచారం.

కన్నడ స్టార్ హీరో యష్ చేయబోయే మరొక పాన్ ఇండియా సినిమాలో తమన్నా మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు సమాచారం. నర్థన్ దర్శకత్వంలో చేయబోయే ఆ సినిమాలో యష్ ఒక నేవి ఆఫీసర్ గా కనిపిస్తాడట. హై వోల్టేజ్ యాక్షన్ కథతో తెరకెక్కుతున్న ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకమని తెలుస్తోంది. ఇక ఇప్పటికే అన్ని భాషల్లో నటించిన తమన్నా అయితే సినిమా మార్కెట్ కు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని హీరో యష్ ఆమెను సెలెక్ట్ చేయించినట్లు తెలుస్తోంది.

Tamannaah upcoming movie with kgf star

ఇక తమన్నా చేతిలో ప్రస్తుతం మంచి సినిమాలే ఉన్నాయి. గోపిచంద్ - సంపత్ నంది కాంబినేషన్లో రానున్న సీటీమార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలకు రెడీగానే ఉంది. హిందీలో కూడా ఒక సినిమా విడుదలకు సిద్ధమైంది. మరోవైపు నితిన్ మాస్ట్రో సినిమాలో నెగిటివ్ పాత్రలో నటిస్తోంది. ఇక సూపర్ హిట్ కామెడీ సినిమాకు ఫ్రాంచైజ్ గా వస్తున్న F3లో వెంకటేష్ కు జోడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X