Tamannah Bhatia రాత్రి 8 గంటల తర్వాత ఆ పని చేయను..కండీషన్ పెట్టిన మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు ఎప్పటికప్పుడు తన ప్రియుడు విజయ్ వర్మతో ప్రేమయణానికి సంబంధించిన విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తనకున్న వింత అలవాటును బయట పెట్టింది. రాత్రి 8 గంటల తర్వాత తనకు ఆ పని చేయడం అస్సలు ఇష్టం ఉండదంటూ చెప్పుకొచ్చింది. మరి తమన్నాకు ఇష్టం లేని ఆ పని ఏంటో తెలుసుకుందాం పదండి.
టాలీవుడ్ లో దాదాపు దశాబ్దానికి పైగానే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది. ఇక ఆమె ఏజ్ తో పాటే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తమన్నా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టింది.

ముఖ్యంగా తన గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ను వెల్లడించింది. తమన్నాకు ఓ వింత అలవాటు ఉందట. అది వింటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ఎవరినైనా తాను కలవాలి అనుకున్నప్పుడు ప్లేస్, ఫుడ్ పై ఎక్కువగా కేర్ తీసుకుంటానని వెల్లడించింది.
అయితే అది కూడా తన సమయాన్ని బట్టి, మానసిక స్థితి, అలసటపై ఆధారపడి ఉంటుందని వివరించింది. ఇక తాజాగా తమన్నా తనకు ఒక వింత అలవాటు ఉందని వెల్లడించింది. తను దేనికైనా సిద్ధంగా ఉంటానని ఎప్పుడూ అందరికీ చెప్తానని, కానీ అది నిజం కాదని ఈ సందర్భంగా తమన్నా వెల్లడించింది.
రాత్రి 8 గంటల తర్వాత ఎక్కడికి వెళ్లడం లేదా ఏదైనా పని చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత పనులు చేయడం మంచిది కాదు అంటూ తమన్నా తనకున్న వింత అలవాటును బయట పెట్టేసింది.
దీంతో ఆమె అభిమానులు డే మొత్తం షూటింగ్స్, వర్కౌట్స్ అంటూ బిజీగా ఉండే ఈ బ్యూటీ ఎనిమిది దాటాక అయినా రెస్ట్ తీసుకోవాలని పెట్టుకున్న రూల్ మంచిదేనని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తమన్నా, విజయ్ వర్మ ఇప్పటికే తమ రిలేషన్షిప్ గురించి బయట పెట్టేశారు. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే వీరి పెళ్లి గురించి రూమర్లు మాత్రమే చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? అనే విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు తమన్నా, విజయ్.
కాగా తమన్నా వెండితెరపై గ్లామర్ ట్రీట్ ఇస్తూ తన నటనతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న తమన్నా రీసెంట్ గా బాక్ అనే హారర్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ మూవీ తమిళ నాట అరణ్మనై 4 పేరుతో రిలీజై మంచి కలెక్షన్లే రాబట్టింది. ఇక సినిమాలు, వెబ్ సిరీస్లే కాదు ఐటెం సాంగ్స్ లోనూ డాన్స్ చేసి అదరగొడుతుంది ఈ బ్యూటీ. అలాగే దానికి తగ్గట్టుగా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న తమన్నా బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











