ప్రధాని నిర్ణయం ఎంతో గొప్పది.. తమన్నా కామెంట్స్
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. రానున్న మూడు వారాల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ పాటింస్తుందని ప్రకటించారు. కరోనాను ఎదుర్కొవాలంటే ఒకే ఒక్క మార్గమని అదే.. ఇంట్లో ఉండటమని సూచించారు. పెద్ద పెద్ద దేశాలు కరోనా ధాటికి తట్టుకోలేకపోతున్నాయని, అమెరికా, ఇటలీ వంటి దేశాలను చూసి భారతదేశం మేల్కొవాల్సి ఉంటుందని ప్రజలకు వివరించారు.
ఈ క్రమంలోనే దేశం మొత్తం లాక్ డౌన్ విధించినట్టు పేర్కొన్నారు. ఇకపై ఇంటి నుంచి ప్రజలెవరూ బయటకు రావొద్దని ఈ లాక్ డౌన్ నేటి అర్ధరాత్రి నుంచే అమలవుతుందని ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తమన్నా స్పందిస్తూ ఓ పోస్ట్ చేసింది.

'మన ప్రధాని నరేంద్ర మోడీ రానున్న 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు.. కరోనాను ఎదురించేందుకు ఇదో గొప్ప నిర్ణయం.. మన జీవితాల కంటే ఏదీ గొప్పది కాదు.. నా కుటుంబం, నేను ఇంట్లోనే ఉన్నాము.. మీ అందరూ కూడా అదే చేయాలని కోరుతున్నాను. ఇంట్లోనే ఉండండి.. ప్రాణాలను కాపాడుకోండ'ని ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications